ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 2, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : నిమ్రాత్ కౌర్, రాహుల్ వోహ్రా, రిధి డోగ్రా, అమూల్ పరోషరా, గౌరవ్ అరోరా తదితరులు
దర్శకుడు : సాహిర్ రాజా
నిర్మాత : అపర్ణ రామచంద్రన్
సంగీతం : సంచిత్ చౌదరి
సినిమాటోగ్రఫీ : వివాన్ సింగ్ సాహి
ఎడిటర్ : సత్య నారాయణన్ శర్మ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాలు అలాగే సిరీస్ లలో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన హిందీ సిరీస్ “కల్ – ది లెగసీ ఆఫ్ రైసింగాస్” కూడా ఒకటి. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
రాజస్థాన్ కి చెందిన ఒక రాజ కుటుంబం తమకి తరతరాలుగా వస్తున్న ప్రతిష్టాత్మక ప్యాలెస్ రాజా ప్రతాప్ రాయ్ సింగ్ (రాహుల్ వోహ్రా) తన కూతుళ్లు, కొడుకులు ఇంద్రాణి రాణి ప్రతాప్ సింగ్ (నిమ్రాత్ కౌర్), కావ్య (రిధి డోగ్రా), అభిమన్యు (అమూల్ పరోషరా) వీరు ఒక భార్య సంతానం అయితే మరో భార్యకి పుట్టిన కొడుకే బ్రిజ్ చంద్ర ప్రతాప్ సింగ్ (గౌరవ్ అరోరా). వీరిలో రాజా ప్రతాప్ సింగ్ కి మాత్రం ఆ ముగ్గురు కంటే బ్రిజ్ అంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. పైగా తన ముగ్గురు పిల్లలు తనని చంపేస్తారని భయపడుతూ కూడా ఉంటాడు. ఇంకోపక్క ఆ ముగ్గురు వారసులు ఒకోకరు ఒకో సమస్యలో ఉంటారు. అందుకు మార్గంగా ఆ ప్యాలెస్ నే అమ్మేయాలని ఒకరు అమ్మకుండా సెటిల్ కావాలని ఒకరు. కానీ ఆ ప్యాలెస్ అమ్మడానికి లేదు అని బలంగా కూర్చుకున్న రాజా ప్రతాప్ ఒకరోజు అనుమానాస్పదంగా హత్య చేయబడతాడు. మరి అతన్ని హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఆ ప్యాలెస్ చుట్టూ నడిచే డ్రామా అలాగే కుటుంబంలో పాలిటిక్స్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సిరీస్ లో ప్రొసీడింగ్స్ కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ అయినా అలా మొదటి నాలుగు ఎపిసోడ్స్ వరకు మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా కథనం కొనసాగుతూ వెళుతుంది అని చెప్పవచ్చు. ఒకో ఎపిసోడ్ లో పలు ట్విస్ట్ లు మరియు టర్నింగ్ లు వంటివి చూసేందుకు మంచి ఆసక్తికరంగా కనిపిస్తాయి. అలాగే అక్కడక్కడా కొన్ని ఎమోషన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి.
ఇంకా వీటితో పాటుగా రాజ కుటుంబాల్లో జరిగే డ్రామా, పాలిటిక్స్ అందులోని కొన్ని ఎత్తుకి పైఎత్తులు లాస్ట్ ఎపిసోడ్స్ లో ఒకటీ రెండు చోట్ల పర్వాలేదనిపిస్తాయి. ఇక నటీనటులలో రాజా ప్రతాప్ సింగ్ గా రాహుల్ వోహ్రా మంచి నటన కనబరిచారు. ఆపాత్రకి తాను సెట్ అయ్యారు. అలాగే వీరితో పాటుగా నటి నిమ్రాత్ కౌర్ మంచి పెర్ఫామెన్స్ ని అందించారు.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమెపై సీన్స్ బాగానే అనిపిస్తాయి. అలాగే చివరి ఎపిసోడ్స్ లో ఆమె నటన బాగుంది. వీరితో పాటుగా గౌరవ్ అరోరా తన పాత్రకి ఫిట్ అయ్యి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని చేసాడు. వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగానే చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ గా వచ్చింది. కానీ దీనిని మాత్రం బాగా సాగదీశారు అనిపిస్తుంది. ఆరంభం మొదటి నాలుగు ఎపిసోడ్స్ బాగానే అనిపిస్తాయి. పెద్దగా బోర్ లేకుండా మంచి కథనం ట్విస్ట్ లతో బాగానే అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా కథనం పలుచబడినట్టు అనిపిస్తుంది.
ఇంకా గ్రిప్పింగ్ కథనం ఈ తరహా సిరీస్ లకి అవసరం ఉంది. ఆ రేంజ్ పొటెన్షియల్ ఈ సిరీస్ కి ఉంది కానీ నెమ్మదిగా ఆ స్కోప్ ని మిస్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే నిమ్రాత్, అభిమన్యు నడుమ సన్నివేశాలు ఒకింత చికాకు తెప్పించవచ్చు.
అతడిని కాపాడుకునే అక్కగా ఆమె పెర్ఫామెన్స్ బాగానే ఉంది కానీ ఇద్దరి నడుమ సన్నివేశాలు అతిగా చిరాకు తెప్పించేలా ఉంటాయి. బాగా ఓవర్ గా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మొదటి 4 ఎపిసోడ్స్ లో సాగిన విధంగా మిగతా నాలుగు ఎపిసోడ్స్ లో కూడా కథనం సాగి ఉంటే బాగుండేది. వీటితో ఈ సిరీస్ మాత్రం బోరింగ్ గానే సాగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఆ ప్యాలెస్ సెటప్ అంతా బాగుంది. అలాగే సంగీతం, కెమెరా వర్క్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ ఓకే అని చెప్పొచ్చు.
ఇక సాహిర్ రాజా దర్శకత్వం విషయానికి వస్తే.. తనకి మంచి పొటెన్షియల్ ఉన్న కథ దొరికింది కానీ దానిని పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా తీసుకెళ్లలేకపోయారు అని చెప్పక తప్పదు. మొదటి కొన్ని ఎపిసోడ్స్ పర్వాలేదు కానీ నెమ్మదిగా మిగతా ఎపిసోడ్స్ మాత్రం చాలా సాగదీతగా హ్యాండిల్ చేశారు. ఆ ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ అంశాలు ఉండగా ఉండగా బోరింగ్ గా తెరకెక్కించారు. వీటిలో కూడా కొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కల్ – ది లెగసీ ఆఫ్ రైసింగాస్’ సిరీస్ ఒక బోరింగ్ ఫ్యామిలీ అండ్ పొలిటికల్ డ్రామా అని చెప్పాలి. స్టార్టింగ్ లో కొన్ని ఎపిసోడ్స్ ఓకే కానీ తర్వాత మాత్రం పరమ బోరింగ్ గా ఈ సిరీస్ సాగుతుంది. సో వీటితో ఈ సిరీస్ బదులు వేరేది ట్రై చేసుకుంటే మంచిది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team
The post ఓటిటి సమీక్ష: ‘కల్ – ది లెగసీ ఆఫ్ రైసింగాస్’ – తెలుగు డబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.