విడుదల తేదీ : మే 4, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : నరేష్, మణి చందన, నంద కిషోర్, రితిక, శ్వేత తదితరులు.
దర్శకుడు : వేగేశ్న సతీష్
నిర్మాణం : వేగేశ్న సతీష్
సంగీతం : ఎస్ కె బాల చంద్రన్
ఛాయాగ్రహణం : ఎస్ కె బాల చంద్రన్
కూర్పు : మధు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ నుంచి రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ కంటెంట్ తో వీక్లీ సిరీస్ గా వస్తున్న లఘు చిత్రాలు కూడా ఒకటి. మరి ఈ సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రమే ‘పెంకుటిల్లు’. దర్శకుడు వేగేశ్న సతీష్ నుంచి వచ్చిన మరో లఘు చిత్రం ఇది కాగా ఇదెలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
రాము (నరేష్), తన పిల్లలు భాస్కర్ (నంద కిషోర్) అలాగే తన చెల్లెలు స్వప్నలు ఇద్దరూ సిటీలో పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతారు. దీనితో తమ తల్లిదండ్రులని సిటీకి తీసుకెళ్ళిపోయి చూసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటారు. అయితే తమ ఊర్లో ఉన్న సొంతింటిని అమ్మించేసి తీసుకెళ్లిపోదాం అని నిర్ణయించుకున్న నేపథ్యంలో సొంత ఇంటితో ఎంతో మమకారం ఉన్న నరేష్, తన భార్య ఏం చేశారు? పిల్లలు తమ మనో వేదనను అర్ధం చేసుకున్నారా లేదా? చివరికి ఆ ఇంటిని అమ్మేశారా లేక వారి కోసం ఉంచేసారా? అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న ఈ వీక్లీ సిరీస్ లో వచ్చిన బెస్ట్ ఎపిసోడ్ ఇది అని చెప్పవచ్చు. దీనికి ముందు వరకు కూడా మంచి ఎమోషన్స్ తో కూడిన ఎపిసోడ్స్ వచ్చాయి అలాగే దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి కూడా పలు ఎపిసోడ్స్ వచ్చాయి. కానీ తన నుంచి వచ్చిన ఆ ముందు వర్క్స్ కంటే మరింత బెటర్ గా ఈ పెంకుటిల్లు ఎపిసోడ్ తప్పకుండా అనిపిస్తుంది.
ముఖ్యంగా సొంత ఇంటితో ఎంతో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఎపిసోడ్ హత్తుకునేలా ఉంటుందని చెప్పాలి. ఉన్న 30 నిమిషాలు కూడా ఎంతో క్లీన్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడా బోర్ లేకుండా మెయిన్ గా ఎమోషన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తప్పకుండా ఆడియెన్స్ ని కదిలించేలా ఈ ఎపిసోడ్ సాగింది.
నరేష్ తన సీనియార్టీతో అలాగే తన వెర్సటైల్ నటనతో పలు ఎమోషనల్ సన్నివేశాలని బాగా పండించారు. అలాగే ఇందులో ఫ్యామిలీ మూమెంట్స్ కూడా చక్కగా ఉన్నాయి. నరేష్ తో పాటుగా తన భార్యగా నటించిన మణి చందన కూడా బాగా చేశారు. ఇంకా నంద కిషోర్ కూడా మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే క్లైమాక్స్ లో ఒక ఫీల్ గుడ్ ముగింపు చూసే వీక్షకులకి ఆనందం కలిగిస్తుంది. వీటితో పాటుగా నరేష్ కి, మణి చందన నడుమ తమ పిల్లల కోసం సాగే ఓ మాటల సన్నివేశం బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ ఒక్క ఎపిసోడ్ లో మాత్రం మంచి బలమైన ఎమోషన్స్ ఉన్నప్పటికీ అదే రీతిలో బలమైన కారణం మాత్రం అంతగా కనిపించదు. తమ తల్లిదండ్రులని సిటీకి తీసుకెళ్లిపోదాం అనుకున్న పిల్లల ఆలోచనకి అందుకు ఊర్లో ఉన్న సొంత ఇంటిని అమ్మేస్తేనే బెటర్ అనే లింక్ అంత కరెక్ట్ గా అనిపించదు.
అమ్మ నాన్నలని తీసుకెళ్లాలి అనుకుంటే ఇంటిని అమ్మడం ఎందుకు అలానే ఉంచి కూడా తీసుకెళ్లొచ్చు కదా అనే ఆలోచన చూసే వీక్షకునికి కలుగక మానదు. కానీ నెమ్మదిగా దీనికి జస్టిఫికేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఇంకొంచెం బెటర్ కాస్టింగ్ ని ఈ సినిమాకి తీసుకోవాల్సింది. నందకిషోర్ భార్య అలాగే చెల్లెలిగా కనిపించిన నటుల్ని కొంచెం బెటర్ గా తీసుకోవాల్సింది. వారు ఆ పాత్రలకి అంతగా సెట్ అయ్యినట్టు అనిపించలేదు.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకునిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సతీష్ వేగేశ్న ఈ వీక్లీ సిరీస్ కి వర్క్ చేశారు. తన అభిరుచి మొత్తం ఈ అన్ని ఎపిసోడ్స్ లో లానే ఈ ఎపిసోడ్ లో కూడా కనిపిస్తుంది. పల్లెటూరు నేపథ్య, విజువల్స్, సంగీతం అలాగే ఎడిటింగ్ వర్క్ కూడా ఈ ఎపిసోడ్ కి బాగున్నాయి.
ఇక దర్శకుడు వేగేశ్న సతీష్ విషయానికి వస్తే.. శతమానం భవతి సినిమాతో మళ్ళీ మర్చిపోతున్న విలువల్ని భావోద్వేగాల్ని అద్భుతంగా తెలుగు ఆడియెన్స్ కి చూపించిన తన నుంచి ఈ లఘు చిత్రం మరో మంచి వర్క్ అని చెప్పడంలో డౌట్ లేదు. తన నుంచి వచ్చిన ముందు ఎపిసోడ్స్ అన్నిటి కంటే ఇది బెటర్ గా ఉంది. మంచి ఎమోషన్స్ తో కదిలేంచేలా క్లీన్ పాయింట్ తో చెప్పిన విధానం వీక్షకులని కదిలిస్తుంది. చిన్న లోపాలు ఉన్నాయి కానీ అవి ఈ ఎపిసోడ్ లో ఎమోషన్స్ ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘పెంకుటిల్లు’ లఘు చిత్రం ఈటీవీ విన్ వీక్లీ సిరీస్ లో ఉత్తమ ఎపిసోడ్ అని చెప్పవచ్చు. చిన్న నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కానీ వాటిని ఇందులో ఎమోషన్స్ మరియు ప్రధాన కథాంశం చుట్టూ తిరిగే కథనం ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఓటిటిలో కుటుంబంతో కలిసి ఒక ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ లాంటిది చూడాలి, లేదా ఇంట్లో తల్లిదండ్రులకి చూపించాలి అనుకుంటే తప్పకుండా ఈ ఎపిసోడ్ ని ఈటీవీ విన్ నుంచి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team
The post ఓటిటి సమీక్ష: ‘పెంకుటిల్లు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.