Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2225

ఓటీటీ సమీక్ష : ష్‌ –ఆహాలో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

$
0
0

SSHHH

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్: ఏప్రిల్ 30, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనేయ, ఐశ్వర్య దత్తా, క్రిషా కురుప్, మీమ్ గోపి తదితరులు
దర్శకత్వం : పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తికేయన్
నిర్మాత : కార్తికేయన్
సంగీతం : కె.ఎస్.సుందర మూర్తి
ఛాయాగ్రహణం : ఎజిళ్ అరసు, కార్తిక్ ముత్తుకుమార్, మరుద నయగమ్, మహేష్ రామకృష్ణ
కూర్పు : రామ్ గోపీ, రాగుల్, సత్యనారాయణ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో తమిళ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘ష్’ తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2024లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి రావడంతో దీనిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్ నాలుగు కథల చుట్టూ సాగుతుంది. స్కూల్ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ చేయడానికి ఇబ్బంది పడే టీచర్.. తన మాజీ ప్రియుడిని కలిసిన ఓ స్త్రీ.. తన భర్త కోసం ఎంతో తపిస్తూ వేచి ఉండే గృహిణి.. ఐఏఎస్ చదివే ఓ కుర్రాడు తన బంధువు అమ్మాయిపై పెంచుకునే ఎమోషన్.. ఇలా నాలుగు వైవిధ్యమైన కథలను మనకు ఈ వెబ్ సిరీస్‌లో చూపెట్టారు. ఈ వెబ్ సిరీస్‌లో మనుష్యుల ఇష్టాలు, వారి ఎమోషన్స్, ప్రేమ-శృంగారం పట్ల వారి భావనలను మనకు చూపెట్టారు.

ప్లస్ పాయింట్స్ :
చాలా మంది తమ ఎమోషన్స్‌ను దాచుకుని ఎదుటివారితో తప్పుగా ప్రవర్తిస్తుంటారు. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో లీడ్ పాత్రలు తమ కోరికను నిర్మొహమాటంగా వ్యక్త పరచడం కొంతమేర ఆకట్టుకునే పాయింట్ అని చెప్పాలి. మోడ్రన్ ప్రపంచంలో రిలేషన్స్ ఎలా ఏర్పడుతాయి అనే శాంపిల్ మనకు ఇందులో చూపెట్టారు. కోర్ పాయింట్ ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

నేటి సమాజంలో సెక్స్ పట్ల ఆకర్షితులయ్యేందుకు ఎలాంటి సందర్భాలు ప్రేరేపిస్తాయి అనే పాయింట్‌ను చక్కగా ప్రెజంట్ చేశారు. ఇక నాలుగు ఎపిసోడ్స్‌లలోనూ యాక్టర్స్ మంచి ట్యాలెంట్ కనబరిచారు. రొమాంటిక్ సీన్స్‌కు తగ్గట్టుగా వచ్చే బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. కొన్ని ఎపిసోడ్స్‌లో స్క్రీన్ ప్లే్ వర్క్ బాగుంది.

మైనస్ పాయింట్స్ :
ఇలాంటి పాయింట్‌ను టచ్ చేసినప్పుడు దాని ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో కేవలం కామవాంఛ అనే పాయింట్‌తో కథలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆకట్టుకోదు. మనుషుల్లో అలాంటి కోరిక పుట్టడానికి గల బలమైన కారణాలు కూడా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది.

ఇక స్కూల్ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమైన అంశం అందరికీ తెలిసిందే. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో పిల్లలకు దాన్ని బోధించేందుకు టీచర్ పడే పాట్లు కొంతమేర చిరాకు తెప్పిస్తాయి. పిల్లలకు బోధించేటప్పుడు టీచర్ ఇబ్బంది పడటం ఏమిటనే పాయింట్ చాలా మందికి నచ్చకపోవచ్చు.

మిగతా ఎపిసోడ్స్‌లలో కూడా కేవలం సెక్స్‌పైనే మేకర్స్ ఫోకస్ పెట్టడంతో ఎమోషన్స్, రిలేషన్స్ వంటి అంశాలు పక్కదారి పట్టినట్లు కనిపిస్తాయి. ఇక స్క్రీన్ ప్లే విషయంలోనూ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చాలా సీన్స్ బోరింగ్‌గా సాగడం ఈ వెబ్ సిరీస్‌కు మైనస్.

సాంకేతిక విభాగం :
ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకులు మరికాస్త డెప్త్ ఉన్న కథలను రాసుకోవాల్సింది. వారు చూపెట్టాలనుకున్న పాయింట్‌కు డెప్త్ ఉన్న కథనం అయితే, ఈ వెబ్ సిరీస్ రిజల్ట్ వేరేలా ఉండేది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సంగీతం పరంగా పాటలు పెద్దగా ప్రభావం చూపకపోయినా, బీజీఎం కాస్త ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. చాలా సీన్స్ స్లోగా సాగడం ప్రేక్షకులను అసహనాన్ని గురిచేస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే ‘ష్’ వెబ్ సిరీస్ బోరింగ్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కోర్ పాయింట్ బాగున్నా, దానికి మరిన్ని ఎమోషన్స్, పాత్రల మధ్య డెప్త్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. స్లోగా సాగే స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్‌కు మేజర్ డ్యామేజ్ చేసింది. రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్‌లను ఇష్టపడేవారికి ‘ష్’ పెద్దగా నచ్చకపోవచ్చు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

The post ఓటీటీ సమీక్ష : ష్‌ – ఆహాలో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2225

Trending Articles