విడుదల తేదీ : మే 09, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : నవీన్ చంద్ర, రాశి సింగ్, ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు.
దర్శకత్వం : రాకేష్ వర్మ
నిర్మాణం: రామకృష్ణ వీరపనేని
సంగీతం : శ్రీరామ్ మద్దూరి
ఛాయాగ్రహణం : దర్శన్ అంబట్
కూర్పు : సత్య. జి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం “బ్లైండ్ స్పాట్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
హైదరాబాద్ కి చెందిన ఒక బిజినెస్ మెన్ జైరాం (రవి వర్మ) తన భార్య దివ్య (రాశీ సింగ్) కి తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. ఇలా ఒకరోజు గొడవ అయ్యాక ఆమె అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకుటుంది. ఈ ఘటనతో ఆ ఇంటి పనిమనిషి సరస్వతి విషయాన్ని ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) కి చెబుతోంది. ఇక ఇక్కడ నుంచి రంగంలోకి దిగిన విక్రమ్ ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని చెబుతాడు. మరి ఆ హత్య చేసింది ఎవరు? ఆ ఇంట్లో ఉన్న వారే చేసారా? లేక బయటవారు చేసారా? అసలు దివ్య మానసిక పరిస్థితి ఏంటి? చివరికి హత్య చేసింది ఎవరు? వారిని ఎవరు పట్టుకున్నారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ చిత్రంలో ఆరంభం డీసెంట్ గా ఉంటుంది అలాగే ఘటన జరిగిన తర్వాత నుంచి కొంచెం కథనం పర్వాలేదు అనిపిస్తుంది. ఒకోకరిపై అనుమానం రేకెత్తించడం ఈ అనుగుణంగా వచ్చే కొన్ని ట్విస్ట్ లు పర్వాలేదు అనిపిస్తాయి. అలాగే నటీనటుల్లో నవీన్ చంద్ర ఎప్పటిలానే సాలిడ్ పెర్ఫార్మన్స్ ని అందించాడు.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫసర్ గా తను పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మంచి లుక్స్ మరియు కొన్ని కీలక సన్నివేలని కూడా తాను బాగా చేశాడు. తనతో పాటుగా ఆలీ రెజాకి మంచి రోల్ పడింది అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో మంచి ఫైట్ సీక్వెన్స్ సహా తనపై ట్విస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా రాశి సింగ్ తన రోల్ లో సెట్ అయ్యింది. తన పాత్ర వరకు ఆమె బాగానే చేశారు. ఇంకా వీరితో పాటుగా రవి వర్మ, గాయత్రి తదితరులు తమ పాత్రలలో మెప్పిస్తారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కూడా ఇది వరకు వచ్చిన చాలా రొటీన్ రెగ్యులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాస్ జాబితాలో ఉంటుందని చెప్పాలి. ఒకటీ రెండు ట్విస్ట్ మినహాయిస్తే కథనం అంత ఎంగేజింగ్ గా సాగదు. చాలా రొటీన్ గా సింపుల్ గా అనిపిస్తాయి.
అలాగే పలు సన్నివేశాలు అయితే ఒకింత ముందే ఊహించదగిన విధంగానే కొనసాగుతాయు. వీటితో పాటుగా లాజిక్స్, ఇంకా కొన్ని ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం మెప్పించదు.
అప్పటివరకు తన జాబ్ లో సిన్సియర్ గా ఉన్న నవీన్ చంద్ర పాత్ర తన ఇన్వెస్టిగేషన్ లో ఒక కీలక అంశం కనుక్కున్న తర్వాత సింపుల్ గా దానికి పరిష్కారానికి వచ్చేయడం లాజిక్ లెస్ గా ఒకింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా అంత ఎఫెక్టీవ్ గా అనిపించదు. సో ఇలాంటి వాటితో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రొటీన్ గానే అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సెటప్ అంతా బాగుంది. శ్రీరామ్ మద్దూరి సంగీతం బాగుంది. కొన్ని సీన్స్ లో స్కోర్ బాగా ఇచ్చారు. దర్సన్ అంబట్ అందించిన కెమెరా వర్క్ బాగుంది. సత్య జి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. ఇక దర్శకుడు రాకేష్ వర్మ విషయానికి వస్తే.. తన వర్క్ అంత ఎఫెక్టీవ్ గా లేదని చెప్పాలి. రొటీన్ మర్డర్ మిస్టరీ లైన్ నే తను ఎంచుకున్నారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహాయిస్తే స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్ గా తను నడపలేకపోయారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ బ్లైండ్ స్పాట్ చిత్రం రొటీన్ అండ్ రెగ్యులర్ గా సాగే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్పొచ్చు. నటీనటులు బాగానే చేశారు. ఒకటీ రెండు ట్విస్ట్ లు మినహా సినిమాలో అంత ఆకట్టుకునే అంశాలు లేవు. వీటితో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
The post సమీక్ష: బ్లైండ్ స్పాట్ – డల్ గా సాగే రొటీన్ థ్రిల్లర్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.