Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : నరివెట్ట –స్ట్రాంగ్ కంటెంట్‌ను దెబ్బతీసిన స్లో పేస్

$
0
0

Narivetta Movie Review

విడుదల తేదీ : మే 30, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : టొవినో థామస్, సూరజ్ వెంజరమూడు, చెరణ్, ఆర్య సలీమ్, ప్రియంవద కృష్ణన్ తదితరులు
దర్శకత్వం : అనురాజ్ మనోహర్
నిర్మాణం : టిప్పుషాన్, షియాస్ హస్సన్
సంగీతం : జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం : విజయ్
కూర్పు : షమీర్ ముహ్మద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళ హీరో టొవినో థామస్ నటించిన ‘నరివెట్ట’ చిత్రం తెలుగు డబ్బింగ్ నేడు(మే 30) థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రయత్నించే వర్గీస్(టొవినో థామస్) తన తల్లి, తాను ప్రేమించిన అమ్మాయి కోసం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. అయితే, అతనికి ఇష్టం లేకుండానే ఆ జాబ్ చేస్తుంటాడు. కాగా, వయనాడ్ ప్రాంతంలో గిరిజనులు అడవుల్లో గుడిసెలు వేసుకుని భూమిని కబ్జా చేశారని.. వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీస్ బెటాలియన్ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత పోలీసులకు, ఆదివాసీలకు మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది..? పోలీసులను ఆదివాసీలు ఏమైనా చేశారా..? టొవినో థామస్‌కు అక్కడ ఎలాంటి నిజాలు తెలుస్తాయి..? చివరకు ఏం జరుగుతుంది..? అనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
మలయాళ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు ఎందుకు ఇష్టమో ఈ సినిమా చూస్తే మరోసారి స్పష్టమవుతుంది. మంచి కథ, దానికి తగ్గ పర్ఫార్మెన్స్ కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా చేశాయి. పోలీస్ థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన అన్ని అంశాలను ఈ సినిమాలో మనం చూడవచ్చు.

ఇక ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండేలా దర్శకుడు చేసిన ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. ఈ ప్రయత్నం కొంత ఫెయిల్ అయినా, అతని జెన్యూన్ అటెంప్ట్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. వాస్తవికతకు దగ్గరగా జరిగిన ఈ కథను ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

అడవుల్లో నివసించే ఆదివాసీలకు ఆ అడవుల్లో రక్షణ లేకుండా పోవడం అనే పాయింట్ సామాన్య ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఇక పోలీసులు వారి పట్ల ఎలా ప్రవర్తించారు.. వారిలో ఎలాంటి గొడవలు చోటు చేసుకుంటాయి.. చివరికి వారిలో ఒకరు ఎలా తిరగబడ్డాడు అనేది చాలా చక్కగా ప్రెజంట్ చేశారు.

మైనస్ పాయింట్స్ :
ఈ పోలీస్ థ్రిల్లర్ చిత్రంలో కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఈ సినిమాలోని లవ్ ట్రాక్ ఈ చిత్రానికి పెద్ద డ్యామేజ్ చేసిందని చెప్పాలి. కథను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ట్రాక్ కొంతవరకు ఉపయోగపడినా, అది పూర్తిగా డెవలెప్ చేయలేదనిపిస్తుంది. దీంతో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ట్రాక్ ప్రేక్షకులను మెప్పించదు.

ఇక రిపీటెడ్‌గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌కు తీసుకెళ్లేందుకు దర్శకుడు ఎంచుకున్న విధానం కూడా కొంతవరకు మెప్పించదు. అటు ఆదీవాసీల్లో కూడా కొందరు స్టార్ క్యాస్టింగ్‌ను తీసుకుని ఉండాల్సింది.

సెకండాఫ్‌లో కథ చాలా నెమ్మదించినట్లుగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంలోనూ చిత్ర యూనిట్ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌ను ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు అనురాజ్ మనోహర్ తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉంది. దాని ఎగ్జిక్యూషన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అయితే.. స్లో పేస్, స్క్రీన్ ప్లే వంటి అంశాలపై ఆయన కేర్ తీసుకోవాల్సింది. ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ సంగీతం అని చెప్పాలి. జేక్స్ బిజోయ్ అందించిన మ్యూజిక్.. ముఖ్యంగా బీజీఎం చాలా బాగుంది. కొన్ని సీన్స్‌ను ఆయన తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగుంది.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘నరివెట్ట’ చిత్రం పోలీస్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకుంటుంది. మంచి కథ, చక్కటి పర్ఫార్మెన్స్‌లు, బీజీఎం ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయి. అయితే, స్లో పేస్, కొన్ని చోట్ల బోరింగ్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు డ్యామేజ్ చేశాయి. మంచి మలయాళ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : నరివెట్ట – స్ట్రాంగ్ కంటెంట్‌ను దెబ్బతీసిన స్లో పేస్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles