Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : ఘటికాచలం –సిల్లీ ప్లేతో సాగే హారర్ డ్రామా !

$
0
0

Ghatikachalam

విడుదల తేదీ : మే 31, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి

దర్శకుడు : అమర్ కామేపల్లి
నిర్మాణం: ఎంసీ రాజు
సంగీతం : ఫ్లావియో కుకురుల్లో
సినిమాటోగ్రఫీ : ఎస్ఎస్ మనోజ్
ఎడిటర్ : శ్రీను బైనబోయిన

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నిఖిల్ దేవాదుల కథానాయకుడిగా పరిచయమైన చిత్రం ‘ఘటికాచలం’. సమ్యు రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

కౌశిక్ (నిఖిల్ దేవాదుల) ఓ మెడికల్ స్టూడెంట్. తన తండ్రి (ఈటీవీ ప్రభాకర్) కోరిక మేరకు తాను మెడిసిన్ చదువుతూ ఉంటాడు. తన మనసుకు నచ్చకపోయినా ఫ్యామిలీ కోసం అన్ని మనసులోనే పెట్టుకుని తనలో తానే ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇలాంటి కౌశిక్, సమ్యు (సమ్యు రెడ్డి)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో ఏదో అతీంద్రియ దుష్ట శక్తి కౌశిక్ ను వేధిస్తూ ఉంటుంది. అసలు ఆ శక్తి ఏమిటి ?, ఎందుకు తన వాయిస్ తో కౌశిక్ ను ఇబ్బంది పెడుతుంది ?, అసలు కౌశిక్ కు మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది ?, చివరకు కౌశిక్ ఈ సమస్య నుంచి ఎలా బయట పడ్డాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధానమైన ప్లస్ పాయింట్ అంటే.. దర్శకుడు అమర్ కామేపల్లి రాసుకున్న స్క్రిప్టే. కథాకథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను అలాగే సస్సెన్స్ ను బాగా ఎలివేట్ చేస్తూ.. అమర్ కామేపల్లి స్క్రిప్ట్ ను బాగా రాసుకున్నారు. కొన్నిసార్లు అయితే ఓ హర్రర్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తూనే ప్రతి సన్నివేశంలో సస్పెన్స్ ను బాగా చూపించాడు. అదేవిధంగా రెండవ భాగంలో స్క్రిప్ట్ కి సంబంధించి మంచి థ్రిల్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి.

ఈ సినిమాలో మెడికో కౌశిక్ పాత్రలో నటించన నిఖిల్ దేవాదుల తన పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఒక పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో మరియు తనకు వస్తోన్న కలలతో భయపడుతూ ఇలా ప్రతి సన్నివేశంలో నిఖిల్ దేవాదుల చక్కని నటనతో ఆకట్టుకున్నాడు పైగా అయోమయ పరిస్థితుల్లో.. నిఖిల్ తన అభినయంతో మరింతగా ఉత్సుకతను పెంచాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథకుడు ఎంసీ రాజు ఇచ్చిన స్టోరీ ఐడియాకు కొన్ని చోట్ల అమర్ ఇంట్రస్టింగ్ ప్లే రాసుకున్నప్పటికీ.. సినిమాలో కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, సినిమా రన్ టైమ్ తక్కువే అయినప్పటికీ, చాలాసేపు సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలగడం, ఇక సాధారణమైన ప్రేక్షకుడికి కథనం గందరగోళంగా అనిపించడం, బి.సి ప్రేక్షకులు ఆశించే అంశాలు సినిమాలో పెద్దగా లేకపోవడం వంటి అంశాలు ఈ ఘటికాచలం సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి.

ఇక సెకండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారనిపిస్తోంది. కొన్ని సీన్స్ బాగానే చిత్రీకరించినప్పటికి, కొంత వాస్తవానికి దూరంగా ఉండటం, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నమ్మశక్యంగా లేకపోవడం కూడా.. సినిమాకి మైనస్ గా అనిపిస్తుంది. మొత్తానికి స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా లేకపోవడం, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు ఫ్లావియో కుకురుల్లో సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ ఎస్ఎస్ మనోజ్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. శ్రీను బైనబోయిన ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ చిత్ర నిర్మాత ఎంసీ రాజు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘ఘటికాచలం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ – కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఐతే, కథనం స్లోగా సాగడం, కొన్ని కీలక కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : ఘటికాచలం – సిల్లీ ప్లేతో సాగే హారర్ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles