Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

ఓటిటి సమీక్ష: ‘స్టోలెన్’–హిందీ ఒరిజినల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో

$
0
0

The Diplomat

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 04, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : అభిషేక్ బెనర్జీ, మియా మెల్జర్, శుభమ్ వర్ధన్, హరీష్ ఖన్నా, సాహిదూర్ రెహమాన్ తదితరులు
దర్శకత్వం : కరణ్ తేజ్ పాల్
నిర్మాణం : గౌరవ్ దిన్హరా
సంగీతం : అర్పత్ బోండీ
సినిమాటోగ్రఫీ : ఇషాన్ ఘోష్
ఎడిటింగ్ : శ్రేయాస్ బెల్తాంగ్డి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

లేటెస్ట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ కి వచ్చిన చిత్రమే ‘స్టోలెన్’. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు అభిషేక్ బెనర్జీ నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

నార్త్ లోనే ఒక రైల్వే స్టేషన్ లో అర్ధరాత్రి సమయం మేర నిద్రిస్తున్న మహిళ జంపా (మియా మెల్జర్) చిన్న పాప చంపా (బేబీ తన్యా) ని ఎవరో దొంగతనం చేస్తారు. అయితే అదే సమయంలో ఫ్లైట్ మిస్ అయ్యి అదే స్టేషన్ కి వచ్చిన రమణ్ బన్సల్ (శుభం వర్ధన్) చేతిలో ఆ పాప టోపీ ఒకటి ఉండేసరికి జంపా తన కూతురుని అతడే అపహరించాడని గొడవ చేస్తుంది. ఇంతలోనే తన తమ్ముడు కోసం బయట ఎదురు చూస్తున్న గౌతమ్ బన్సల్ (అభిషేక్ బెనర్జీ) లోపలకి వెళ్లేసరికి ఈ రచ్చ అంతా నడుస్తుంది. అప్పటికే పోలీసులు కూడా అక్కడే ఉండడంతో పరిస్థితులు మరింత కష్టంగా మారుతాయి. మరి ఆ పాప ఏమయ్యింది? ఎవరు ఏ కారణం చేత ఎత్తుకెళ్లారు? జంపా కోసం రమణ్ ఏం చేసాడు? ఈ ఘటన తర్వాత ఈ ముగ్గురు లైఫ్ ఎలా టర్న్ అయ్యింది? చివరికి ఆ పాప దొరికిందా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం నిడివి చాలా తక్కువే అయినప్పటికీ ఈ మొత్తంలో కూడా చూసే ఆడియెన్స్ కి మరీ అంత బోర్ కొట్టకుండా నడిచే కథనం హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా మొదలై సీన్ స్టార్ట్ అయ్యిన నిమిషం నుంచే మంచి ఆసక్తికరంగా పరిస్థితులు మారడం వాటితో పాటుగా లీడ్ నటీనటులు సాలిడ్ వర్క్ ని అందించారు.

పాతాళ లోక్ నటుడు అభిషేక్ బెనర్జీ లాంటి సాలిడ్ నటుడు ఉన్నప్పటికీ తనకి సోదరునిగా నటించిన శుభం వర్ధన్ మరింత ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. దాదాపు ప్రీ క్లైమాక్స్ వరకు కూడా శుభం మంచి నటన కనబరిచాడు. అలాగే తన అన్నగా అభిషేక్ కూడా తన రోల్ లో జీవించాడని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ పార్ట్ లో తన సహజమైన పెర్ఫామెన్స్ తన లోని నటుడుని చూపిస్తుంది.

ఇక వీరితో పాటుగా వీరితోనే ట్రావెల్ అయ్యే నటి మియా మేల్జర్ కూడా చాలా బాగా చేశారు. ఆమె తన రోల్ లో నాచురల్ లుక్స్ లో కనిపించి అంతే నాచురల్ పెర్ఫామెన్స్ ని చూపించారు. ఇక వీటితో పాటుగా కథనంలో బిల్డప్ అయ్యే సస్పెన్స్ ఇంకా థ్రిల్ అంశాలు ఈ సినిమాలో హైలైట్ అని చెప్పవచ్చు. దర్శకుడు ఈ మూమెంటంని దాదాపు సినిమా మొత్తం కనిపించేలా చేశారు. ఇంకా వీటితో పాటుగా పలు ట్విస్ట్ లు కూడా చూసే వీక్షకుని ఎగ్జైట్ చేస్తాయి. అలాగే అభిషేక్ పాత్రని డిజైన్ చేసిన విధానం కూడా సినిమాలో బాగుంది. ఇలా ఓవరాల్ గా ఈ చిత్రం డీసెంట్ స్టార్ట్ తో మొదలై ముగుస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కథనం దాదాపు ఎంగేజింగ్ గానే నడుస్తుంది కానీ కొన్ని కొన్ని చోట్ల కథనం స్లో అయ్యినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు లీడ్ నటీనటులు తమ సర్వవైవల్ కోసం తెరకెక్కించిన సన్నివేశాలు కొద్దిగా ట్రిమ్ చేయాల్సింది.

అలాగే లైన్ కూడా మరీ అంత కొత్తగా అనిపించకపోవచ్చు. ఇంకా అభిషేక్ బెనర్జీ నుంచి మరింత ఎక్కువ ఆశించినవారు కూడా కొంచెం నిరాశ పడే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు తన కోణంలో ఈ చిత్రం అంతగా కనిపించదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సెటప్ ని అంతా చాలా నాచురల్ గా డిజైన్ చేసుకొని సహజ వాతావరణంలోనే తెరకెక్కించడం ఆకర్షణగా నిలుస్తుంది. ఇక అర్పత్ బోండీ సంగీతం బాగుంది, కానీ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు. ఇషాన్ ఘోష్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొన్ని కొన్ని సీన్స్ ని బాగా చూపించారు. అలాగే శ్రేయాస్ బెల్తాంగ్డి ఎడిటింగ్ కూడా బాగుంది. అక్కడక్కడా కథనం కొంచెం స్పీడప్ చేయాల్సింది.

ఇక ఈ చిత్రానికి కరణ్ తేజ్ పాల్ దర్శకత్వం విషయానికి వస్తే.. తాను మంచి వర్క్ అందించారని చెప్పొచ్చు. ముఖ్యంగా తాను కథనం నడిపించిన విధానం ఆడియెన్స్ ని సినిమాలో లీనం అయ్యేలా చేస్తుంది. జస్ట్ కొన్ని చోట్ల మినహాయిస్తే తాను ఈ థ్రిల్లర్ ని బాగా హ్యాండిల్ చేశారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘స్టోలెన్’ చిత్రం ఈ వీకెండ్ లో డీసెంట్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారికి మంచి ట్రీట్ ఇస్తుంది అని చెప్పవచ్చు. మెయిన్ లీడ్ ముగ్గురు నటులు కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లతో మెప్పించగా దర్శకుడు ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన విధానం కూడా సినిమాలో బాగుంది. భాషతో సంబంధం లేకుండా ఒక ఇంట్రెస్టింగ్ డీసెంట్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

The post ఓటిటి సమీక్ష: ‘స్టోలెన్’ – హిందీ ఒరిజినల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles