Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all articles
Browse latest Browse all 2257

సమీక్ష : ‘థగ్ లైఫ్’ –రెగ్యులర్ గా సాగే యాక్షన్ డ్రామా !

$
0
0

విడుదల తేదీ : జూన్ 05, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్.
దర్శకుడు : మణిరత్నం
నిర్మాతలు : రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్.
సంగీతం : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : రవి కె. చంద్రన్
ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేశారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

రంగరాయ శక్తి రాజు (కమల్ హాసన్) తన అన్న మాణిక్యం (నాజర్)తో కలిసి ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌గా ఒక గ్యాంగ్‌ను లీడ్ చేస్తూ ఉంటాడు. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్‌తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో శక్తి రాజు ఒక చిన్నారిని (శింబు) కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారి అమర్‌ (శింబు)ను సొంత కొడుకులా పెంచుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం తన పై జరిగిన దాడిలో శక్తి రాజు, అమర్‌పై అనుమానం వ్యక్తం చేస్తాడు. అదే సమయంలో, తన తండ్రిని చంపింది శక్తి రాజేనని తెలుసుకున్న అమర్, శక్తి రాజును ఒక లోయలోకి తోసేస్తాడు. చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తి రాజు మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా ? లేదా ? చిన్నప్పుడే తప్పిపోయిన అమర్, చంద్ర (ఐశ్వర్య లక్ష్మి) మళ్లీ కలిసారా ? లేదా ?, చివరికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

కమల్ హాసన్ తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు డిఫెరెంట్ వేరియేషన్స్ లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో కమల్ హాసన్ చాలా బాగా నటించాడు. అలాగే, తన లుక్స్ తో కూడా కమల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాడు. మరో కీలక పాత్రలో నటించిన శింబు నటన ఆకట్టుకుంది. కమల్, శింబు మధ్య ఎమోషనల్ డ్రామా కూడా బాగుంది.

హీరోయిన్ గా త్రిష మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. అభిరామి నటన బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో మరో కీలకమైన పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా చాలా వైల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. నాజర్ బాగానే చేశాడు. కానీ అతని పాత్రలో కొత్తదనం ఏమీ లేదు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు మణిరత్నం రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

‘థగ్ లైఫ్’ కథలోని ప్రతి పాత్ర, ఆ పాత్రల తాలూకు ప్రతి ఎమోషన్ ఫోర్స్డ్ గానే ఉంటుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ పీక్ స్టేజ్ లో ఉన్నాయనే ఫిల్ కలిగినా.. దాని కోసం ఈ పాత్ర ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది ? అనే అనుమానం కూడా వెంటాడుతూ ఉంటుంది. నిజానికి కమల్ హాసన్ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న మణిరత్నం, అంతే స్థాయిలో ఈ ‘థగ్ లైఫ్’ సినిమా ట్రీట్మెంట్ ను మాత్రం రాసుకోలేదు.

ముఖ్యంగా ఆసక్తికరంగా ‘థగ్ లైఫ్’ కథనాన్ని రాసుకోవడంలో మణిరత్నం కొన్ని చోట్ల విఫలం అయ్యారు. చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా గత తన సినిమా శైలిలోనే మణిరత్నం, ఈ సినిమాని కూడా రెగ్యులర్ ప్లేతోనే నడిపాడు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన ఆయన సెకండాఫ్ ని మాత్రం మరీ సాగతీశారు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. అసలు కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ మణిరత్నం మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మణిరత్నం కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథాకథనాలను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడా ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను తగ్గించాల్సింది. సినిమా నిడివి బాగా ఎక్కువైపోయింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘థగ్ లైఫ్’ అంటూ హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కమల్ హాసన్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఐతే, సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ… ఆ ఎమోషన్ లో, ఆ కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు. దీనికితోడు సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

The post సమీక్ష : ‘థగ్ లైఫ్’ – రెగ్యులర్ గా సాగే యాక్షన్ డ్రామా ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Viewing all articles
Browse latest Browse all 2257

Trending Articles