Quantcast
Channel: సమీక్షలు | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
Viewing all 2201 articles
Browse latest View live

సమీక్ష : కృష్ణ అండ్ హిజ్ లీల –నెమ్మదిగా సాగినా అలరిస్తుంది

$
0
0
Krishna And His Leela Review

Release date : June 25th, 2020

123telugu.com Rating : 3/5

తారాగణం : సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దాశ్రీనాథ్, షాలిని

రచన&దర్శకత్వం : రవికాంత్ పేరేపు

నిర్మాత : సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి

సంగీతం : శ్రీచరణ్ పాకాల

థియేటర్స్ బంద్ నేపథ్యంలో చిన్న సినిమాలు ఓ టి టి లో విడుదల అవుతుండగా.. కృష్ణ అండ్ హిజ్ లీల కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడం జరిగింది. దగ్గుబాటి రానా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథ :

కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) సత్య(శ్రద్ధ శ్రీనాథ్) ఇద్దరూ ప్రేమించుకొని విడిపోతారు. సత్యతో బ్రేక్ వలన అప్సెట్ లో ఉన్న కృష్ణ… రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. ఉద్యోగం నిమిత్తం బెంగుళూరు వెళ్లిన కృష్ణకు తన మాజీ లవర్ సత్య కనిపిస్తుంది. సత్య మరలా కృష్ణకు దగ్గిర అవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణ…సత్య మరియు రాధాలతో ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. ఏక కాలంలో ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న కృష్ణ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ…

 

ప్లస్ పాయింట్స్ :

ప్రేమ.. ప్రియురాళ్ల విషయంలో స్పష్టత లేని కన్ఫ్యూస్డ్ లవర్ గా యంగ్ హీరో సిద్దూ ఆకట్టుకున్నారు. క్లిష్టమైన పాత్రలో సిద్దూ మేమేకమై నటించాడు. రొమాన్స్ అండ్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు.

ఎప్పుడో మొదలైన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ లుక్ ప్రెసెంట్ లుక్ కి భిన్నంగా ఉంది. హీరో సిద్ధూ ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి మధ్య రొమాన్స్ అండ్ ఎమోషన్స్ సహజంగా సాగాయి. ఇక మరో యంగ్ హీరోయిన్ షాలిని అనుభవం లేకున్నా పాత్రకు న్యాయం చేసింది. నేటి అమ్మాయిల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. డిఫరెంట్ మూడ్స్ తో సాగే ఆమె పాత్రకు ఆమె గుడ్ ఛాయిస్ అనిపించింది.

ఇక కమెడియన్ హర్ష మంచి పాత్ర దక్కించుకోగా ఝాన్సీ, సంపత్ తమ పరిధిలో అలరించారు. శ్రీచరణ్ పాకాల సాంగ్స్ మెచ్చుకోవాల్సిన మరో అంశం. ప్రేమ విషయంలో నేటి యువత అస్పష్ట వైఖరి చక్కగా ప్రస్తావించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఏక కాలంలో ఒకరికి తెలియకుండా..మరొకరితో ప్రేమ వ్యవహారం నడపడం అనేది గతంలో అనేక హిందీ మరియు తెలుగు చిత్రాలలో ప్రస్తావించిన అంశమే. కాబట్టి ఇదో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం అని చెప్పలేం.

అలాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీకి మంచి ముగింపు ఇవ్వలేక పోయారు దర్శకుడు రవికాంత్. ఇక క్లైమాక్స్ లో కూడా ఎమోషన్స్ అంతగా పండలేదు. దానితో పాటు అనేక దశలలో కథనంలో వేగం లోపించింది.
 

సాంకేతిక విభాగం :

అత్యున్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ముందుగా చెప్పుకున్నట్లు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అద్భుతం. పాటలతో పాటు.. నేపథ్య సంగీతం సినిమాకు మంచి ఫీల్ అందించింది. ఇక డైలాగ్స్ మరో ఆకట్టుకొనే అంశం.

ఇక డైరెక్టర్ రవికాంత్ విషయానికి వస్తే ఎంచుకున్న సబ్జెక్టు పాతదే అయినా తన నెరేషన్ తో మెప్పించే ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఆయన రాసుకున్న సన్నివేశాలు.. డైలాగ్స్ మరియు కథనం సినిమాకు ఆకర్షణ జోడించింది. ఐతే క్లైమాక్స్ మరింత ఆసక్తి కరంగా మలచాల్సింది. అలాగే ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ పలికించ లేకపోయారు.

తీర్పు :

నేటి తరం యువత ప్రేమ, రిలేషన్స్ విషయంలో వారి ప్రవర్తన, ఆలోచనా విధానం వంటి విషయాలను ఈ మూవీలో దర్శకుడు ప్రస్తావించారు. హీరో హీరోయిన్స్ నటన, మ్యూజిక్ అండ్ రొమాన్స్ ఈ మూవీలో ఆకట్టుకొనే అంశాలు. రొటీన్ స్టోరీ కావడంతో పాటు, నెమ్మదిగా సాగే కథనం నిరాశపరిచే అంశాలు. అయిన్నప్పటికీ ఆసక్తికర సన్నివేశాలు, అలరించే సంభాషణలు మెప్పిస్తాయి. మొత్తంగా ఈ లాక్ డౌన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల మంచి ఛాయిస్ గా చెప్పవచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review


లాక్ డౌన్ రివ్యూ: కడక్- హిందీ ఫిలిం (సోనీ లివ్)

$
0
0

తారాగణం: సాహుకర్, శ్రుతి సేథ్, రజత్ కపూర్, తారా శర్మ సలుజా, సాగర్ దేశ్ముఖ్, నూపూర్ అస్తానా, కల్కి కోచ్లిన్, చంద్రచూర్ రాయ్, పలోమి ఘోష్, మనోజ్ పహ్వా, మరియు యామిని దాస్

దర్శకుడు: రజత్ కపూర్

నిర్మాత: గురుదాస్ పై, మిత్యా టాకీస్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ కడక్ ని ఎంచుకోవడం జరిగింది. సోనీ లివ్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో రాఘవ్ (చంద్రచోర్ రాయ్) సునీల్ (రణ్వీర్ షోరే) ఇంటికి వెళతాడు. ఈ విషయమై సునీల్ మరియు రాఘవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. భార్య చేతిలో మోసపోయానని తీవ్ర అసహనంలో ఉన్న రాఘవ్ తనని తాను తుపాకీతో కాల్చుకొని చనిపోతాడు. ఆ సంఘటనతో సునీల్ అతని భార్య (మాన్సి ముల్తానీ) షాక్ కి గురవుతారు. అదే రోజు దీపావళి కావడంతో బంధులు మరియు మిత్రులు సునీల్ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. ఆ ఇంట్లో శవం ఉందని తెలియని బంధువుల నుండి వారు రాఘవ్ శవాన్ని ఎలా దాచారు? చివరికి వీరి దీపావళి ఎలా ముగిసింది అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

అధ్బుత నటుడిగా పేరున్న రణ్వీర్ షోరే మరో మారు తన సత్తా చాటాడు. ఇంట్లో జరిగిన ఊహించని సంఘటన వలన ఎదురయ్యే టెన్షన్ మరియు ఫ్రస్ట్రేషన్ వంటి ఎమోషన్స్ ఆయన చక్కగా పలికించాడు. సీరియస్ గా సాగే అతని పాత్రలో కామెడీ జొప్పించిన విధానం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది.

డార్క్ కామెడీ మరియు ఎమోషన్స్ అలరిస్తాయి. రణ్వీర్ షోరే భార్య పాత్ర చేసిన మాన్సి ముల్తానీ పాత్ర పరిధిలో అలరించారు. కథలో ట్విస్ట్స్ పరవాలేదు.

 

ఏమి బాగోలేదు?

ఒక సింపుల్ కథకు దర్శకుడు ఇచ్చిన ప్రారంభం బాగుంది. ఐతే చివరి అర గంట సినిమా పక్కదారి పట్టింది. అనేక పాత్రలు ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా, మెయిన్ పాయింట్ నుండి డైల్యూట్ చేస్తాయి. ఇక చాలా సన్నివేశాలు లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇంట్లో శవాన్ని పెట్టుకొని ఇద్దరు భార్య భర్తల ప్రవర్తన వాస్తవానికి దూరంగా ఉంది.

 

చివరి మాటగా

డార్క్ కామెడీ తో సాగే కడక్ మూవీలో రణ్వీర్ షోరే నటన నేపథ్యంలో సాగే కామెడీ అలరిస్తాయి. మంచి ప్రారంభం కలిగిన ఈ మూవీ ముఖ్యమైన చివరి అరగంట నిరుత్సాహపరుస్తుంది. అంచనాలు లేకుండా చూస్తే కొంచెం నచ్చే అవకాశం ఉంది.

Rating: 2.5/5

లాక్ డౌన్ రివ్యూ : రస్బరి హిందీ వెబ్ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

$
0
0

నటీనటులు: స్వరా భాస్కర్, సునాక్షి గ్రోవర్, నీలు కోహ్లీ, ఆయుష్మాన్ సక్సేనా, ప్రధుమాన్ సింగ్, చిత్తరంజన్ త్రిపాఠి, అక్షయ్ బాచు, అక్షయ్ సూరి

దర్శకత్వం: నిఖిల్ భట్

నిర్మాతలు: తన్వీర్ బుక్వాలా, సమీర్ నాయర్, దీపక్ సెగల్

సంగీతం: ప్రణయ్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ రస్బరి ని ఎంచుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

మీరట్ కి చెందిన యంగ్ టీనేజర్ నంద్(ఆయుష్మాన్ సక్స్సేనా) కొత్తగా తమ కాలేజ్ కి ఇంగ్లీష్ టీచర్ గా వచ్చిన షాను(స్వర భాస్కర్) పై మనసుపారేసుకుంటాడు. ఆమె ఆలోచనలతో బ్రతికేస్తున్న నంద్ కి షాను మేడం లోని మరో కోణం బయటపడుతుంది. అసలు ఎవరు ఈ షాను? ఆమె నేపథ్యం ఏమిటీ? షాను పై కోరిక పెంచుకున్న నంద్ సంగతి ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే రస్బరి సిరీస్ చూడాలి…

 

ఏమి బాగుంది?

వయసు ప్రభావం వలన టీనేజ్ లో వచ్చే కోరికలతో ఇబ్బందిపడే యువకుడి పాత్రలో ఆయుష్మాన్ సక్సేనా నటన ఆకట్టుకుంది. తన టీచర్ ఆలోచనతో గడిపేసే పాత్రలో అతను మెప్పించాడు. నంద్ పేరెంట్స్ పాత్రలు చేసిన వారు కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు.

స్మాల్ టౌన్ మీరట్ సెటప్, అక్కడి ఆడవాళ్ళ మనస్తత్వాలు చెప్పిన విధానం బాగుంది. ఇక స్వర భాస్కర్ పాత్రకు నిడివి మరియు ప్రాధాన్యత అంతగా లేకున్నప్పటికీ చాలా వరకు తన గ్లామర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. నంద్ అతని గర్ల్ ఫ్రెండ్ మధ్య రొమాన్స్…బీజీఎమ్ మరియు డైలాగ్స్ ఆకట్టుకొనే అంశాలు.

 

ఏమి బాగోలేదు?

ఇప్పటికే అనేక సినిమాలో చూపించిన టీచర్ అండ్ స్టూడెంట్ రొమాన్స్ డ్రామా ప్రేక్షకులకు కొత్త ఏమీ కాదు. ఐతే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కావడంతో దర్శకుడు కొంచెం రొమాన్స్ డోస్ పెంచి తీశారు. ఇక టీచర్ గురించి స్టూడెంట్స్ చర్చలో వచ్చే పదాలు చాల వల్గర్ ఉన్నాయి. స్వర భాస్కర్ పాత్ర మలచిన విధంగా ఏమి బాగోలేదు. ఆమె పాత్ర ద్వారా దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడో అర్థం కాని పరిస్థితి.

ఒక దిశా నిర్దేశం లేకుండా సాగే కథలో అనేక ఎపిసోడ్స్ విసుగుపుట్టిస్తాయి. ఏ దశలో కూడా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుడిని ఆకట్టుకోలేక పోయింది. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, డైలాగ్స్ మినహా చెప్పుకోదగ్గ అంశాలు ఏవి లేవు.

 

చివరి మాటగా

మొత్తంగా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన రస్బరి వెబ్ సిరీస్ పాత కాలం కాన్సెప్ట్ తో పాటు అర్థం పర్ధం లేని కథనంతో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పడుతుంది. స్వర భాస్కర్ గ్లామర్, డైలాగ్స్ మినహాయిస్తే అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సిరీస్ జోలికి వెళ్ళకుంటేనే బెటర్.

Rating: 1.5/5

లాక్ డౌన్ రివ్యూ : నగ్నం ( శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ప్రసారం)

$
0
0

తారాగణం: శ్రీ రాపాక, దీపక్ తదితరులు

రచన : రామ్ గోపాల్ వర్మ

దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘నగ్నం’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘శ్రేయాస్ ఈటి అప్’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

కథ గురించి ముచ్చటించుకునే అవకాశం వర్మ మనకు ఇవ్వలేదు. సరే ఉన్న బూతు బాగోతాన్నే క్లుప్తంగా చెప్పుకుంటే.. (జమల్) పనివాడితో ఎఫైర్ పెట్టుకుంటుంది శ్రీ రాపాక. అది కాస్త ఆమె భర్త దీపక్ చూడటం… రెగ్యులర్ గానే అతగాడికి ఆక్రోశం పెరిగిపోయి భార్య మీద దాడి చేయడం.. చివరికీ బక్కప్రాణి అయిన జమాల్ కొట్టిన సింగిల్ షాట్ కే అతను బకెట్ తన్నేయడం.. ఫైనల్ గా శ్రీ రాపాక ఆ మర్డర్ ను పనివాడి మీద నెట్టేసి.. తన దొంగ ఏడుపుతో సినిమా అని చెప్పుకోలేని ఈ బుడ్డ సినిమాని ముగించేస్తోంది. ఇంతటితో వర్మగారి క్రియేటివిటీ కూడా ముగిసింది.

 

ఏం బాగుంది :

ఏం బాగుంది అనే ప్రశ్న దీనికి సూట్ అవ్వదేమో.. అయినప్పటికీ ఉన్నవాటిలోనే పాజిటివ్ కోణంలో నుండి చూస్తే.. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా రావాలనుకున్న.. ఈ సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్, అలాగే కొన్ని బూతు క్రియేటివిటీ షాట్స్ ఆకట్టుకుంటాయి. ఇక మెయిన్ క్యారెక్టర్ గా నటించిన శ్రీ రాపాక తన పాత్రకు తగ్గట్లు ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందచందాలతో తన సెక్సీ మూమెంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మిగిలిన ఇద్దరు నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

ఏం బాగాలేదు :

ఒక్క మాటలో ఏం బాగాలేదు. వివాదాస్పద అంశాలతో దర్శకుడిగా నెట్టుకొస్తోన్న రాంగోపాల్ వర్మ, నగ్నంలోని మెయిన్ కంటెంట్ అంతా ట్రైలర్ లోనే చూపించేసాడు, అంతకు మించి సినిమాలో ఇంకేమి లేదు. యూత్ వీక్ నెస్ ను క్యాష్ చేసుకోవటానికి ప్రతి షాట్ లో అవసరం ఉన్నా లేకపోయినా వర్మ ఓవర్ ఎక్స్ పోజింగ్ ను ఇరికించి చికాకు పుట్టించారు.

పైగా ప్రతి షాట్ బూతు మిళితమయ్యే ఉంటుందిగాని, ఏ షాట్ కూడా స్క్రీన్ ప్లేను మాత్రం పరుగులు పెట్టించదు. ఆర్జీవీ కథాకథనాలలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను పూర్తిగా వదిలేసి, అనవసరమైన బోల్డ్ షాట్స్ తో సినిమాని నింపడం, దీనికి తోడు బలం లేని స్క్రిప్ట్ లో బలహీన సీన్స్ ను సృష్టించి సినిమా మీద ఎలాంటి ఇంట్రస్ట్ కలగకుండా మన సహనాన్ని పూర్తిగా నీరుగార్చాడు.

అసలు.. ఇలాంటి సినిమాలను తీయాలనే ఆలోచన రామ్ గోపాల్ వర్మకు ఎందుకొస్తున్నాయో.. ఆర్జీవీ ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ఇక వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ సినిమాతో ఆర్జీవీ అనే బ్రాండ్ కి పెద్ద బ్యాండ్ పడిపోయినట్టే.

 

చివరి మాటగా :

మొత్తంమీద, నేకెడ్ నగ్న మరియు నగ్నం అంటూ ఆర్జీవీ అందించిన ఈ అత్యంత దిగువ స్థాయి బూతు చిత్రాన్ని చూడకపోవడమే ఉత్తమైన పని అనిపించుకుంటుంది. కుళ్లిపోయిన కాలం నాటి బూతుమయంతో డబ్బులు చేసుకోవాలనే ఒకే ఒక్క ఆలోచనతో మోతాదుకు మించిన గ్లామర్ షోను కురింపించేసి వర్మ అందించిన ఈ చెత్త సినిమాని దయచేసి ఎవ్వరు చూడకండి. ఎవర్నీ చూడనియ్యకండి. టైం అండ్ మనీ ఆదా చేసినవారు అవుతారు.

 

Rating : 1.5/5

లాక్ డౌన్ రివ్యూ: సాలిస్బరి పాయిజనింగ్స్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్(నెట్ ఫ్లిక్స్)

$
0
0

నటీనటులు: అన్నే-మేరీ డఫ్, రాఫ్ స్పాల్, మైఅన్నా బురింగ్, మార్క్ అడ్డీ, అన్నాబెల్ స్కోలే

రచయితలు: ఆడమ్ ప్యాటర్సన్, డెక్లాన్ లాన్

దర్శకుడు: సాల్ దిబ్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సోలిస్బరి పాయిజనింగ్ ఎంచుకోవడం జరిగింది క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

2018లో రష్యాకు చెందిన మాజీ గూఢచారులు సుర్జాయ్, యూలియా యూ కే లోని సోలిస్భరీ సిటీలో విష ప్రయోగం ద్వారా చంపబడతారు. అది రష్యా మరియు యూకే దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుంది. ఇక వారిద్దరినీ చంపడానికి ఉపయోగించిన కెమికల్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తిస్తారు. అనేక మంది అమాయకుల ప్రాణాలను హరించే ఆ ప్రమాదకర విషం నుండి ఆ సిటీని ఎలా కాపాడగలిగారు అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ మొత్తం ఓ సిటీలో అమాయక ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం అధికారులు పడే తపన, మార్గాల అన్వేషణలో తీవ్రతతో సాగే ఉత్కంఠ సన్నివేశాలు అలరిస్తాయి. దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు వంటివి, కొత్త కోణంలో చూపించిన విధానం బాగుంది. అసలు చివరికి ఆ సిటీ ప్రజల ప్రాణాలు ఏమవుతాయో అన్న ఉత్కంఠ సిరీస్ చివరి కొనసాగుతుంది.

అధికారుల మధ్య కొనసాగే టెన్షన్.. కుట్ర కోణం ఆకట్టుకుంటాయి. దేశాల మధ్య ఆధిపత్యం కోసం జరిగే ఎత్తుగడలు చూపిన విధానం బాగుంది. అలరించే ట్విస్ట్ లు మరియు కట్టిపడేసే కథనం మొత్తంగా నాలుగు ఎపిసోడ్స్ ప్రేక్షకుడిని సిరీస్ తో పాటు ముందుకు తీసుకెళతాయి.

 

చివరి మాటగా

మొత్తంగా సోలిస్బరి పాయిజనింగ్ ఆద్యంతం ఆసక్తిరేపుతూ ప్రేక్షకుడిని కథనంలో లీనం చేస్తూ సాగుతుంది. 45 నిమిషాల నిడివి గల ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగుతాయి. వాస్తవిక సంఘటల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుడి అంచనాలకు మించి గొప్ప అనుభూతినిస్తూ సాగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ లాక్ డౌన్ టైం లో ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Rating: 4/5

లాక్ డౌన్ రివ్యూ : ‘భోంస్లే’ ( సోనీ లైవ్ లో ప్రసారం)

$
0
0

తారాగణం: మనోజ్ బాజ్‌పాయ్, సంతోష్ జువేకర్ తదితరులు

దర్శకుడు: దేవశీష్‌ మఖిజ

సంగీతం: మంగేష్ ధక్డే

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సినిమా ‘భోంస్లే’. దేవశీష్‌ మఖిజ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘సోనీ లైవ్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

గణపత్ భోంస్లే (మనోజ్ బాజ్‌పాయ్) ఆరోగ్య సమస్యల కారణంగా పోలీసు శాఖ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేయవలసి వస్తుంది. ముంబై నగరంలోని ఒక ప్రాంతంలోని ఒక గదిలో అతను బోరింగ్ జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి సమయంలో, బీహార్ నుండి సీత (ఇప్షితా చరబోర్తి) అనే అమ్మాయి మరియు ఆమె సోదరుడు గణపత్ పక్కనే ఉండటానికి వస్తారు. వారితో పరిచయం అవుతుంది. అతనితో సన్నిహితంగా ఉంటారు. విలాస్ ధావ్లే (సంతోష్ జువేకర్) అనే స్థానిక వ్యక్తి స్థానికంగా ఉద్యోగాల్లో ఒక విప్లవాన్ని ప్రారంభించి ముంబై వాసులకు మాత్రమే ఉద్యోగాలలో ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలనడటంతో.. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనలు కారణంగా సీతకు మరియు ఆమె సోదరుడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి గణపత్ భోంస్లే ఏమి చేస్తారు అనేది మిగతా మొత్తం కథ.

ఏం బాగుంది :

భోంస్లేగా మనోజ్ బాజ్‌పాయ్ వన్ మ్యాన్ షోతో అద్భుతంగా నటించాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న మనోజ్ బాజ్‌పాయ్ తన పాత్రలో జీవించి చిరస్మరణీయమైన నటనను కనబర్చాడు. మానవజాతి యొక్క వైవిధ్యాలలో చిక్కుకున్న 60 ఏళ్ల వ్యక్తిగా మరియు అతని రాష్ట్రంపై ప్రేమతో అతను నటించిన విధానం ఆకట్టుకుంటుంది. మనోజ్ బాడీ లాంగ్వేజ్ ఎమోషనల్ యాక్టింగ్, అలాగే అతను ఒక వృద్ధుడి యొక్క సూక్ష్మ భావోద్వేగాలను ఎక్స్ ప్రెస్ చేసిన విధానం అబ్బురపరుస్తోంది. మొత్తానికి ఈ చిత్రం మనోజ్ బాజ్‌పాయ్ నటనా పరాక్రమానికి ఒక ఉదాహరణ.

ఇక నర్సుగా నటించిన ఇప్షితా చక్రబోర్తి కూడా చాల నటించింది. ముంబైలోని వాతావరణాన్ని అలాగే అక్కడి పరిస్థితులను దర్సకుడు బాగా చూపించారు. ఈ చిత్రంలో కెమెరామెన్ కెమెరావర్క్, విజువల్స్ ను చూపించిన విధానం అద్భుతమైనది. అలాగే ఆర్ట్ డైరెక్షన్ ప్రత్యేకమైంది. పైగా ఈ చిత్రానికి మంచి థీమ్ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే ఉంది.

ఏం బాగాలేదు :

చాలా మంది చూపించిన దానికి భిన్నంగా ఏదో ఆశించటం వల్ల సినిమా ముగింపు కాస్త నిరాశపరిచింది. ఈ చిత్రం యొక్క పేస్ దాని స్వంత నేరేషన్ ను కలిగిలేకపోవడం బాగాలేదు. పైగా ఇది అందరికీ నచ్చదు. ఇక సినిమాలో చూపిన మత మరియు ప్రాంతీయ వివాదం చాలా సన్నివేశాల్లో అధికంగా తీసుకోబడకపోవడం నిరాశ కలిగిస్తోంది.

చివరి మాటగా :

మొత్తంమీద, ముంబై వంటి నగరంలో వలసదారులను ఎలా చూస్తారనే దాని గురించి ఎలివేట్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా నిర్మించిన చిత్రం ఇది. కథా నేపథ్యం, కథ మరియు మనోజ్ బాజ్‌పాయ్ నటన, దర్శకుడి పనితీరు బాగా ఆకట్టుకుంటాయి.అయితే ప్లే నెమ్మదిగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం థీమ్, ఎమోషనల్ డెప్త్ తో మెప్పిస్తోంది. ఈ లాక్డౌన్ వ్యవధిలో మంచి సినిమా చూడాలనుకునే వారు ఈ సినిమా చూడొచ్చు.

Rating: 3.5/5

సమీక్ష : ’47 డేస్’–డల్ గా సాగిన సస్పెన్స్ థ్రిల్లర్ !

$
0
0
47 Days Review

Release date : జూన్ 30th, 2020

123telugu.com Rating : 2.5/5

నటి నటులు : సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్,రవివర్మ తదితరులు

రచన,దర్శకత్వం : ప్రదీప్ మద్దాలి

నిర్మాతలు : శశిభూషణ్ నాయుడు,రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ,

సంగీతం : రఘు కుంచె

సినిమాటోగ్రఫీ : జి.కె.

 

 

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమా ’47 డేస్’. ఈ సినిమాకి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు.
ఈ లాక్ డౌన్ సమయంలో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయింది. ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

 

కథ :

సత్య (సత్యదేవ్) ఏసీపీ.. చిన్నప్పటి నుండి తనతో అనాధ ఆశ్రమంలో పెరిగిన పద్దూ (రోషిణి ప్రకాష్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక అంతా హ్యాపీగా వెళ్తున్న వాళ్ల లైఫ్ లో సడెన్ గా పద్దూ ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అసలు పద్దూ అలా ఎందుకు చేసిందో అర్ధం కాక సత్య డిప్రెషన్ లో వెళ్లి జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు. ఈ మధ్యలో బిజినెస్ మెన్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య కేసు సత్య దృష్టికి వస్తోంది. శ్రీనివాస్ ఆత్మహత్యకి పద్దూ ఆత్మహత్యకి సంబంధం ఉందేమోనని సత్యకి అనుమానం రావడంతో, శ్రీనివాస్ కేసు పై విచారణ చేస్తాడు. ఈ క్రమంలో సత్య ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? ఇంతకీ పద్దూ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ? ఆమె చావు వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

సత్యదేవ్ వన్ మ్యాన్ షోతో నడిచిన ఈ సినిమాలో.. సత్యదేవ్ రెండు గెటప్స్ లో చక్కగా నటించాడు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని ఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో సత్యదేవ్ చాలా బాగా నటించాడు. సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఇక హీరోయిన్ గా నటించిన రోషిణి ప్రకాష్ తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.

సెకెండ్ హీరోయిన్ గా చేసిన పూజాజవేరి కూడా బాగానే నటించింది. విలన్ గా నటించిన నటుడు కూడా చాల బాగా నటించాడు. అలాగే హీరో ఫ్రెండ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న కొన్ని లవ్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సెకెండ్ హాఫ్ లో ఆయన రాసుకున్న కొన్ని సస్పెన్స్ సీన్స్ మరియు విలన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా పర్వాలేదనిపిస్తోంది. చివర్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమాని ముగించడం కూడా పర్వాలేదు.

 

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సినిమా సాగితేనే.. ఆడియన్స్ ను ఆకట్టుకోగలం. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకున్నా.. మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

దీనికి తోడు మెయిన్ గా సినిమాలో ఇంట్రసింగ్ ప్లే మిస్ అయింది. కొన్ని సీన్స్ గందరగోళంగా సాగుతున్న ఫీలింగ్ కలిగిస్తాయి. సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా ఇంకా ఎఫెక్టివ్ రాసుకోవాల్సింది. అలాగే సెకెండ్ హారోయిన్ క్యారెక్టర్ కూడా సినిమాకి మైనస్ అయింది. పైగా ఆమె ట్రాక్ బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. మొత్తానికి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మంచి అటెంప్ట్ చేశాడు గానీ, అది ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. మ్యూజిక్ సినిమాకు ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. అయితే దర్శకుడు ఆకట్టుకునే ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

 

తీర్పు :

’47 డేస్’ అంటూ వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మరియు ఫ్యూ ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నా.. ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ఖాళీగా ఉంటే మాత్రం.. సత్యదేవ్ నటన కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

లాక్ డౌన్ రివ్యూ: కప్పేలా-మలయాళ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

$
0
0

నటీనటులు: అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ

దర్శకత్వం: ముహమ్మద్ ముస్తఫా

నిర్మాత: విష్ణు వేణు

సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్

ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మలయాళ ఫిల్మ్ కప్పేలా ను ఎంచుకోవడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

ఓ రాంగ్ కాల్ ద్వారా జెస్సీ, విష్ణుకు పరిచయం ఏర్పడుతుంది. వీరి ఫోన్ పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడిన ఈ జంట ఓ రోజు కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐతే జెస్సీ ని కలవడానికి రాయ్ వస్తాడు. విష్ణు ఎలా ఉంటాడో తెలియని జెస్సీ రాయ్ ని విష్ణు అనుకుంటుంది. అసలు ఈ రాయ్ ఎవరు? జెస్సీని కలవాల్సిన విష్ణు ఏమయ్యాడు? చివరకు జెస్సీ, విష్ణు కలిశారా లేదా? వీరిద్దరి కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి…

 

ఏమి బాగుంది?

యంగ్ విలేజ్ గర్ల్ గా అన్నా బెన్ నటన ఈ మూవీకి ఆకర్షణ. ఇన్నోసెంట్ క్యూట్ కేరళ అమ్మాయిగా ఆమె చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె తన కళ్ళతో కష్టమైన భావాలు తేలికగా పలికించింది.

విష్ణు పాత్ర చేసిన రోషన్ మాథ్యూ పాత్ర ప్రేక్షకులకు షాక్ గురిచేస్తుంది. అతని పాత్రలోని ఉహించని వేరియేషన్స్ చక్కగా పలికించాడు. రెండు షేడ్స్ కలిగిన పాత్రకు న్యాయం చేశాడు. మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన శ్రీనాథ్ భసి కూడా తన పరిధి మేర మెప్పించారు.

సామాజిక సందేశంతో కూడిన రొమాంటిక్ డ్రామా ఆకట్టుకుంది. అమాయకంగా ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారో … దానివలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చక్కగా వివరించారు. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్ బాగున్నాయి. బీజీఎమ్ ఆకట్టుకుంది.

 

ఏమి బాగోలేదు?

 

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించిన ఈ మూవీలో దర్శకుడు కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళలేదు. అదొక మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక ప్రధాన కథను చెప్పడానికి ఆయన చాలా సమయం తీసుకున్నాడన్న భావన కలిగింది.

 

చివరి మాట:

 

అలరించే రొమాన్స్, ఊహించని మలుపులు, ఆసక్తికర కథనంతో సాగే కప్పేలా తప్పక చూడదగ్గ చిత్రం అని చెప్పొచ్చు. సామాజిక అంశాన్ని ఆకట్టుకొనేలా చెప్పిన దర్శకుడి ప్రతిభకు మంచి మార్కులు పడతాయి. ఈ లాక్ డౌన్ సమయంలో కప్పేలా మంచి ఛాయిస్.

Rating: 3.5/5


సమీక్ష : భానుమతి రామకృష్ణ –మెప్పించే భానుమతి రామకృష్ణల ప్రేమ గాథ

$
0
0
BhanumathiRamakrishna Review

Release date : జులై 3rd, 2020

123telugu.com Rating : 3.25/5

నటి నటులు : నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా, రాజా చెంబోలు, హర్ష చేముడు

రచన,దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి

నిర్మాతలు : యస్వంత్ ములుకుట్ల

సంగీతం : శ్రావణ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ యు

 

డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న మరొక చిత్రం భానుమతి రామకృష్ణ. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటి లవ్ డ్రామా ఆహా లో జులై 3న విడుదల కానుంది. స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

స్టోరీ:

 

భానుమతి ఓ ముఫై ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన జీవితంలో జరిగిన బ్రేక్ అప్ వలన ఈ ఇండిపెండెట్ లేడీ…లవ్, రిలేషన్ పట్ల అయోమయ స్థితిలో ఉంటుంది. అదే సమయంలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ కలిగిన రామకృష్ణ(నవీన్ చంద్ర) ట్రాన్ఫర్ పై హైదరాబాద్ లో భానుమతి చేసే కంపెనీలో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మొదట్లో రామకృష్ణను ఇష్టపడని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడిపోతుంది. రెండు భిన్న నేపధ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనేది మొత్తంగా భానుమతి రామకృష్ణ మూవీ సారాంశం…

 

ప్లస్ పాయింట్స్:

ఓ ప్రేమ కథలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీగా సాగే ఈ మూవీపై ఎక్కడా విసుగన్న భావన రాదు. ప్రధాన పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, సంభాషణలకు తోడు…కట్టిపడేసే కథనం మంచి అనుభూతిని పంచుతుంది. సున్నితమైన సన్నివేశాలకు బీజీమ్ మరింత ఆకర్షణ జోడించింది.

ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేడీగా సలోని నటన చాలా సహజంగా ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ లా ఆమె పాత్ర తీర్చిదిద్దగా ఆ పాత్రకు సలోని మంచి ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ చిత్రం కూడా దాదాపు హీరోయిన్ ఎమోషన్స్, అభిరుచుల కోణంలో సాగుతుంది.

ఇక గ్రామీణ నేపథ్యం కలిగిన అమాయకపు సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ గా నవీన్ చంద్ర నటన మెచ్చుకోవాల్సిందే. పాత్రకు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వాస్తవికతకు అద్దం పట్టాయి. ఈ పాత్ర ద్వారా నవీన్ ఎటువంటి పాత్రనైనా తన మార్క్ నటనతో మెప్పించగలనని నిరూపించాడు.

ఇక హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు చాలా సహజంగా సాగాయి. కమెడియన్ హర్ష ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయగా నేటి తరం యూత్ స్వభావాన్ని గుర్తు చేస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఒకటిన్నర గంట నిడివి గలిగిన ఈ మూవీలో మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలు జోడించి నిడివి పెంచితే బాగుండన్న భావన కలుగుతుంది. పాత్రల మధ్య ఎమోషన్స్ పండినా కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేదు.

ఇక హీరోయిన్ సెంట్రిక్ మూవీలా సాగే ఈకథలో దర్శకుడు ఎక్కువగా హీరోయిన్ పాత్రపైనే ఫోకస్ పెట్టి.. హీరో పాత్రను కొంచెం విస్మరించినట్లున్నాడు. ఈ పాయింట్ కూడా దర్శకుడు దృష్టిలో పెట్టుకొని ఉంటే…ముగింపు మరింత ఆకర్షణగా ఉండేది.

 

సాంకేతిక విభాగం:

 

పాటలు పర్వాలేదనట్లున్నా బీజీఎమ్ మాత్రం అద్బుతంగా కుదిరింది. ఉన్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఇక లోతైన అర్థంతో కూడా సున్నితమైన మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.

దర్శకుడు శ్రీకాంత్ నాగోతి గురించి చెప్పాలంటే… ఓ చిన్న కథను ఆసక్తికరంగా నడిపిన తీరు బాగుంది. ఆయన రాసుకున్న కథనం మరియు సన్నివేశాలు చాలా సహజంగా మనసుకు హత్తుకునేలా సాగాయి. కమర్షియల్ అంశాల కోసం…అవసరం లేని హంగులు జోడించ కూడా తెరకెక్కించి మెప్పించారు. హీరోయిన్ పాత్రతో పాటు హీరో పాత్రకు మరికొంత ప్రాధాన్యత…వారి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ జోడించి ఉంటే మరింత ఆకర్షణగా ఉండేది.

 

తీర్పు:

ఓ సింపుల్ కథలో ప్రధాన పాత్రల మధ్య సహజంగా అనిపించే సన్నివేశాలు…ఆకట్టుకొనే సంభాషణలతో భానుమతి రామకృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది ఎవరు ఎరుగని కథ కాకున్నప్పటికీ హీరో హీరోయిన్స్ నటన, అద్భుత సంగీతం మూవీకి మంచి ఆకర్షణ జోడించాయి. లాక్ డౌన్ సమయంలో ఆహ్లాదం పంచే ఈ భానుమతి రామకృష్ణ మూవీని తప్పక చూడండి .

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

లాక్ డౌన్ రివ్యూ : సుఫియమ్ సుజాతయమ్ (అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం)

$
0
0

తారాగణం: జయసూర్య, అదితి రావు హైదరి, దేవ్ మోహన్ తదితరులు

దర్శకత్వం: షానవాస్ నరణిపుళ

నిర్మాత : విజయ్‌ బాబు

సంగీతం : ఎం జయచంద్రన్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సిరిస్ ‘ సుఫియమ్ సుజాతయమ్’. షానవాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘అమెజాన్ ప్రైమ్‌’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

సుజాత ( అదితి రావు హైదరి) అందం అభినయం ఉన్న మాట్లాడలేదు. అయితే ఆమె ఒక మసీదులో పనిచేసే ముస్లిం సూఫీ (దేవ్ మోహన్) తో ప్రేమలో పడుతుంది. సుజాత మసీదు నుండి ఎర్లీ అజాన్ల కొరకు డాన్స్ చేస్తోంది. మరియు సూఫీతో కలిసి ముఖ్య విషయంగా ఉంటుంది. కానీ ప్రతి ప్రేమకథలో మాదిరిగానే, సుజాత తల్లిదండ్రులు ఆమె ప్రేమను సూఫీ మ్యాచ్‌ను ఇష్టపడరు. దుబాయ్‌ లోని రాజీవన్ (జయసూర్య) తో వివాహం జరిపిస్తారు. సుజాత బలవంతపు వివాహాన్ని ఎలా నడిపిస్తుంది? వీటన్నిటి మధ్యలో సూఫీ, రాజీవన్‌ల జీవితాల్లో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ఏం బాగుంది :

ఈ చిత్రంలో అదితి రావు హైదరి నటన అద్భుతంగా ఉంది. మాట్లాడలేని పాత్రను పోషిస్తున్నప్పుడు.. ఆమె పలికించిన హావభావాలు, నృత్యాలు మరియు అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆమె వ్యక్తీకరణలు అద్భుతమైనవి. ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు చాలా సన్నివేశాల్లో ఆమె భావోద్వేగ విస్ఫోటనం అద్భుతమైనవి. అదితి ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తోంది. నటుడు దేవ్ మోహన్ కూడా సూఫీ పాత్రకు పరిపూర్ణతను తీసుకువచ్చాడు. అతనికి ఇచ్చిన పాత్రలో బాగా నటించాడు. అతని స్వరం మరియు అతను ఉర్దూ పదాలు మరియు కవితలను పఠించే విధానం కూడా చాలా బాగుంది.

అయితే ఈ చిత్రానికి జయసూర్య నటనే ఎక్కువుగా స్కోర్ చేస్తోంది. అతని పనితనం ప్రశంసనీయమైన పనితీరుగా నిలుస్తోంది. రెండువ భాగంలో అతను ఈ చిత్రానికి చాలా బలం అయ్యాడు. ఇక సినిమాలో సంగీతం అగ్రస్థానంలో ఉంది. మరియు కెమెరా పని కూడా అసాధారణమైనది. ఈ చిత్రం మొదటి భాగంలో కవితా అనుభూతిని కలిగి ఉండటం మరో విశేషం. నిర్మాణ రూపకల్పనకు ప్రత్యేక ప్రస్తావన అవసరం. సంభాషణలు మరియు నిర్మాణ విలువలు కూడా చక్కగా ఉన్నాయి.

ఏం బాగాలేదు :

ఈ చిత్రం ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ అనే సినిమా నుండి ఎక్కువగా ప్రేరణ పొందింది. అలాగే నిన్ను కోరి యొక్క ఆనవాళ్లను కూడా కలిగి ఉంది. సెటప్ అంతా బాగుంది కాని కథ పాతది. రోమాన్స్ మరియు డ్రామా ప్రదర్శించబడిన ప్రారంభ గంట తర్వాత, చిత్రం రెగ్యులర్ గా పెద్దగా మార్పులేనిదిగా సాగుతుంది. రచన బలహీనంగా ఉండటం, ఆసక్తికరమైన క్లైమాక్స్ సెటప్‌లోకి తీసుకువచ్చే వరకు ప్లే బాగాలేకపోవడం కూడా సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

లవ్ జిహాద్ యొక్క థీమ్ కూడా ఈ చిత్రంలో ఉన్నా.. అది కరెక్ట్ గా ఎలివేట్ కాకపోవడం, మరియు సినిమా ఇతివృత్తంలోని మెయిన్ అంశం కూడా ఎస్టాబ్లిష్ కాకపోవడం బాగాలేదు. ఏమైనా సినిమా కొంతమందికి నచ్చినప్పటికీ, మిగిలిన ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు.

చివరి మాటగా :

మొత్తంమీద, ఈ ‘సుఫియమ్ సుజాతయమ్’ కొన్ని పాత హిందీ చిత్రాల నుండి ప్రేరణ పొందిన ఒక రొమాంటిక్ డ్రామా. అయితే ఈ సినిమాని సెట్ చేయబడిన నేపథ్యం బాగుంది. అలాగే నటీనటుల ప్రదర్శనలతో పాటు, డీసెంట్ రోమాన్స్ మరియు క్లైమాక్స్ కూడా చక్కగా ఉన్నాయి. అయితే చాలా సన్నివేశాల్లో ప్లే నెమ్మదిగా సాగడం, పైగా సాధారణ కథ కావడం మరియు నిస్తేజమైన సీన్స్ ఉండటంతో ప్రేక్షకులకు కొన్ని చోట్ల అసహనం కలుగుతుంది. మీరు తక్కువ అంచనాలతో గనుక ఈ సినిమాని చూస్తే, కొన్ని సన్నివేశాలు మీకు నచ్చవచ్చు. కానీ, ఈ సినిమాలో కొత్తగా ఏమీ లేదు.

Rating: 2.5/5

లాక్ డౌన్ రివ్యూ: మస్తీస్ –తెలుగు వెబ్ సిరీస్(ఆహా)

$
0
0

నటీనటులు : నవదీప్ పల్లపోలు, హెబా పటేల్, బిందు మాధవి, చాందిని చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు

రచయిత : క్రిష్ జాగర్లమూడి

లాక్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తెలుగు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ఆహాలో విడుదలైన వెబ్ సిరీస్ మస్తీస్ ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

భార్య భర్తలు అయిన ప్రణవ్(నవదీప్) గౌరీ( బిందు మాధవి) మస్తీస్ అనే పోష్ రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు. ఆ రెస్టారెంట్ మేనేజర్ (రాజ చెంబోలు) అదే హోటల్ లో వెయిట్రెస్ గా పనిచేస్తున్న లేఖ(చాందిని చౌదరి) ప్రేమలో పడతాడు. మరో ప్రక్క ఓ మ్యూజిక్ బ్యాండ్ లో సింగర్ అయిన తాన్యా(హెబా పటేల్) కెరీర్ లో ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె మ్యూజిక్ బ్యాండ్ లో తన ఎక్స్ లవర్ కూడా సభ్యుడిగా ఉంటాడు. ఈ మూడు జంటల మధ్య వారి యాంబిషన్స్, డెసిషన్స్ మరియు రిలేషన్స్ కొన్ని పరిణామాలకు దారితీస్తాయి. ఆ పరిణామాలు ఏమిటీ? ఆ రెస్టారెంట్ చుట్టూ ముడిపడివున్న ఈ మూడు జంటల జీవితాలు ఎలా ముగిశాయి అనేది మస్తీస్ కథ..

 

ఏమి బాగుంది?

స్టార్ డైరెక్టర్ క్రిష్ రాసిన ఈ సిరీస్ మంచి పునాది, కథా బలం కలిగి వుంది. కథలో ప్రధాన పాత్రలన్నిటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ డైరెక్టర్ ఆకట్టుకొనే కథనంతో చక్కగా నడిపారు. నేటి ఆధునిక సమాజంలో మనుషుల స్వభావాలు, రిలేషన్స్ మరియు కెరీర్ పట్ల ఉండే ఆలోచన విధానం ఈ సిరీస్ లో చక్కగా ప్రస్తావించారు.

ఇక హీరో నవదీప్ గుడ్ అండ్ బ్యాడ్ యాంగిల్ కలిగిన పాత్రలో మెప్పించారు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కించుకున్న హీరోయిన్ బిందు మాధవి మెప్పించింది. ఫిదా ఫేమ్ రాజా చెంబోలు ఎమోషనల్ లవర్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ చాందిని చౌదరి లవ్, కెరీర్ పట్ల కన్ఫ్యూషన్ కలిగిన అమ్మాయిగా ఆ పాత్రకు న్యాయం చేశారు. సింగర్ గా హెబ్బాపటేల్ రోల్ సైతం సిరీస్ కి ఆకర్షణగా చెప్పవచ్చు. చివరిగా మోడల్ గా నెగెటివ్ రోల్ చేసిన అక్షర గౌడా ఆకట్టుకున్నారు.

ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ సిరీస్ సెటప్, కాస్ట్యూమ్స్ అంతా చాలా రిచ్ గా ఉన్నాయి. మూడు ప్రధాన జంటల మధ్య రిలేషన్స్ మరియు ఎమోషన్స్ బాగా కుదిరాయి. ఇక ఆయా జంటల జీవితాలకు ఇచ్చిన ముగింపు కూడా అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

ఇప్పటికే అనేక హిందీ మరియు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు ఈ నేపథ్యంలో వచ్చాయి. దీనితో ఆ సిరీస్ ల ప్రభావం చాలా ఎక్కవుగా ఉన్న భావన కలిగిస్తుంది. ఇక వెబ్ కంటెంట్ కావడంతో బూతుల డోసు కొంచెం ఎక్కువగా వాడేశారు. ఈ సిరీస్ కంటెంట్ సాంప్రదాయ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.

 

చివరి మాటగా

చక్కని ఎమోషన్స్, ఆకట్టుకొనే కథనం, ఉన్నత నిర్మాణ విలువలతో కూడా మస్తీస్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నేటి నగరాలలో యువతీ, యువకుల మధ్య ఉండే రిలేషన్స్, యాంబిషన్స్, కెరీర్ వంటి విషయాలను చక్కగా ప్రస్తావించారు. కొన్నీ హిందీ వెబ్ సిరీస్ ల వాసనలు ఉన్నప్పటికీ మొత్తంగా అలరిస్తుందని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఈ సిరీస్ మంచి ఛాయిస్.

Rating: 3.25/5

లాక్ డౌన్ రివ్యూ : లాల్ బజార్-హిందీ సిరీస్(జీ5)

$
0
0

నటీనటులు : అనిర్బన్ చక్రవర్తి, హృషితా భట్, దిబియేండు భట్టాచార్య, రోంజిని చక్రవర్తి, సుబ్రత్ దత్తా, విజయ్ సింగ్

దర్శకత్వం: సయంతన్ ఘోసల్

నిర్మాత : నిస్పాల్ సింగ్

ఛాయాగ్రహణం : రమ్య సాహా

ఎడిటింగ్ : గౌరబ్ దత్తా

లాక్ డౌన్ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ లాల్ బజార్ ని ఎంచుకోవడం జరిగింది. హీరో అజయ్ దేవ్ గణ్ నిర్మాతగా జీ5లో అందుబాటులోకి వచ్చిన ఈ క్రైమ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

కలకత్తాలోని రెడ్ లైట్ ఏరియా సెక్స్ రాకెట్ మరియు దందాలకు అడ్డాగా ఉంటుంది. అక్కడ జరిగే అక్రమాలకు అడ్డుకట్టవేసి సాధారణ పరిస్థితులు తేవాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఐతే ఆ ఏరియాలోని ఓ సెక్స్ వర్కర్ హత్యకు గురవడంతో పరిస్థితులు తారుమారవుతాయి. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? లాల్ బజార్ లో అసలు ఏమి జరుగుతుంది? నేరాల వెనుకున్న వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనేది మిగతా కథ..

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లో ప్రాధాన పాత్రల చేసిన హ్రిషిత భట్ మెప్పిస్తుంది. మరో ప్రధాన పాత్ర చేసిన కౌశిక్ సేన్ తన నటనతో సిరీస్ కి మంచి ఆకర్షణ చేకూర్చారు. రెడ్ లైట్ ఏరియా సెట్ అప్ మరియు పురాతన కోలకతా నగరాన్ని తెరపై ఆవిష్కరించి తీరు బాగుంది. క్రైమ్ సన్నివేశాలతో పాటు కొన్ని ఇన్వెస్టిగేటివ్ సీన్స్ బాగున్నాయి. డైలాగ్స్ మరియు బీజీఎమ్ మరో ప్రధాన ఆకర్షణ.

 

ఏమి బాగోలేదు?

దర్శకుడు ప్రధాన కథలోకి వెళ్ళడానికి రెండు ఎపిసోడ్స్ కి పైగా సాగదీశారు, దీనితో మొదటి ఎపిసోడ్స్ బోరింగ్ గా ఉన్నాయి. ఈ కథలో ఉన్న కాంప్లెక్సిటీ మరియు లేయర్స్ గందరగోళానికి గురిచేస్తాయి. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ కథకు కావలసిన ట్విస్ట్స్ లేకపోవడం వలన ప్రేక్షకుడికి ఎటువంటి ఉత్కంఠ కలగదు. ఇక ప్రధాన పాత్రలు చేసిన నటులను మినహాయిస్తే మిగతా నటుల పెరఫార్మెన్సు ఏమాత్రం ఆకట్టుకోదు. ఈ సిరీస్ లో గే ఎపిసోడ్ కూడా ఇబ్బంది కలిగిస్తుంది.

 

చివరిమాటగా

మొత్తంగా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లాల్ బజార్ సిరీస్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎటువంటి మలుపు లేకుండా సాగే సిరీస్ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపడంలో విఫలం చెందించి. ఐతే చివరి రెండు ఎపిసోడ్స్ కొంచెం ఉపశమనం కలిగించే అంశాలు.

Rating: 2.5/5

లాక్ డౌన్ రివ్యూ: బ్రీత్ ఇంటూ ది షాడోస్-హిందీ సిరీస్(అమెజాన్ ప్రైమ్)

$
0
0

నటీనటులు: అభిషేక్ బచ్చన్, అమిత్ సాధ్, నిత్యా మీనన్, ఇవానా కౌర్, సైయామి ఖేర్, హృషికేశ్ జోషి, శ్రుతి బాప్నా, రేశం శ్రీవర్ధన్

దర్శకత్వం: మయాంక్ శర్మ

నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, నిధి అగర్వాల్, అజయ్ జి రాయ్, విజయ్ కొఠారి

ఛాయాగ్రహణం: ఎస్.భారత్వాజ్

ఎడిటింగ్: సుమీత్ కోటియన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ వెబ్ సిరీస్ బ్రీత్ ఇంటూ ది షాడోన్ ని ఎంచుకోవడం జరిగింది. అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

 

భార్యాభర్తలైన అవినాష్ సభర్వాల్(అభిషేక్ బచ్చన్) అభా సభర్వాల్(నిత్యా మీనన్) తమ ఆరేళ్ళ కూతురు సియాతో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఉంటారు. సియా కిడ్నాప్ వారి జీవితాలలో కలకలం రేపుతోంది. సియాను కిడ్నాప్ చేసినవాడు అవినాష్ ని డబ్బులకు బదులుగా తాను చెప్పినవారిని చంపవలసిందిగా కోరుతాడు. తన డిమాండ్ నెరవేర్చని పక్షంలో సియాను చంపేస్తాను అని బెదిరిస్తాడు. మరి కూతురు కోసం అవినాష్ కిల్లర్ గా మారతాడా? అసలు ఈ కిడ్నాపర్ ఎవరు? అతను కొందరిని ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? సియా సేఫ్ గా తల్లిదండ్రుల వద్దకు చేరిందా లేదా ? అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది.

 

ఈ సిరీస్ తో హీరో అభిషేక్ బచ్చన్ ఘనమైన ఓ టి టి ఎంట్రీ ఇచ్చారని చెప్పొచ్చు. కిడ్నాప్ కి గురైన కూతురు కోసం తపించే తండ్రి పాత్రలో ఆయన జీవించారు. తన ఆవేదన, బాధలను అభిషేక్ కళ్లతో పలికించారు. ఈ పాత్రకు ఆయన వంద శాతం న్యాయం చేశారు. ఇక సిరీస్ లో అభిషేక్ పాత్రతో సమానంగా సాగే ఆయన భార్య పాత్రలో నిత్యా అధ్బుత నటన కనబరిచారు. ఆమె హిందీ డిక్షన్ కూడా చక్కగా కుదిరింది. అభిషేక్ కి సపోర్టింగ్ ఇచ్చే భార్యగా నిత్యా అలరించారు. ప్రమాదంలో ఉన్న కూతురు కోసం తల్లిదండ్రులు మరియు క్రిమినల్ మధ్య నడిచే డ్రామా చక్కగా కుదిరింది.

ప్రతి ఎపిసోడ్ లో మైమరిపించే మలుపులు, మంచి ముగింపు ఆకట్టుకుంటాయి. సయామీ ఖేర్ పాత్రతో పాటు అమిత్ షద్ పోలీస్ గా మెప్పించారు. ఇక అధ్బుతమైన బీజీఎమ్ కి తోడు ఆకట్టుకునే కథనం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతాయి. ఇక సిరీస్ మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ షాక్ కి గురిచేస్తుంది.

 

ఏమి బాగోలేదు?

 

12ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్ కొంచెం నిడివి చాలా ఎక్కువన్న భావన కలుగక మానదు. ఇక సస్పెన్సు రివీల్ అయిన తరువాత వచ్చే సన్నివేశాలు నెమ్మదించాయి. ఎడిటింగ్ విషయంలో కొంచెం నైపుణ్యం కనబరిచి ఉంటే బాగుండేది. అలాగే అమిత్ షాద్ లవ్ స్టోరీ కుడా కొంచెం సాగదీత ధోరణిలో సాగింది.

 

చివరి మాటగా

 

మొత్తంగా చెప్పాలంటే అలరించే కథనం, ఆకట్టుకొనే మలుపులతో పాటు అభిషేక్ మరియు నిత్యా మీనన్ నటనతో ఈ సిరీస్ అలరించడం ఖాయం. ఎక్కువ నిడివి, ఎడిటింగ్ వైఫల్యాలు మినహాయిస్తే బ్రీత్ అధ్బుతమైన వెబ్ సిరీస్ అని చెప్పాలి. ఈ లాక్ డౌన్ సమయంలో బ్రీత్ మంచి ఛాయిస్ అనడంలో సందేశం లేదు.

Rating: 3/5

లాక్ డౌన్ రివ్యూ : ‘కాక్టెయిల్’ ( జీ5లో ప్రసారం)

$
0
0


తారాగణం: యోగి బాబు, రష్మి గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్ తదితరులు

సంగీతం : సాయి భాస్కర్

దర్శకత్వం : రా విజయ మురుగన్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘కాక్టెయిల్’. రా విజయ మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

డాన్ (యోగి బాబు) మరియు అతని టీంలోని నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తమ స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకుంటారు . అయితే వారు మరుసటి రోజు ఉదయం మేల్కొనే సరికి అక్కడ ఒక అమ్మాయి మృతదేహం ఉంటుంది. ఇంతలో, మరొక సందర్భంలో, ఒక విగ్రహం పోతుంది. నిజాయితీగల పోలీసు, రాజా మణికెన్ (సాయాజీ షిండే ) నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం రెండు కథలు ఒక పాయింట్ తర్వాత కనెక్ట్ అవుతాయి. ఈ క్రమంలో మరింత భయాందోళనలను ఎదురవుతాయి. ఇంతకీ చంపబడిన అమ్మాయి ఎవరు? అలాగే విగ్రహ దొంగతనం ఏమిటి? మరియు డాన్ మరియు అతని ఫ్రెండ్స్ తమను తామూ ఎలా రక్షించుకున్నారు ? అనేది మిగిలిన కథ.

ఏం బాగుంది :

యోగి బాబు ఈ చిత్రంలో, తన నుండి ప్రేక్షకులు ఆశించిన కామెడీని బాగానే అదించాడు. ముఖ్యంగా తన పాత్రతో తన టైమింగ్ తో ఈ చిత్రాన్ని తన భుజాల పై మోసాడు. అతని వన్ లైనర్స్ చాలా బాగున్నాయి. షాయాజీ షిండే కూడా పోలీసుగా చక్కగా నటించాడు. ఇక ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన ప్లేతో ప్రారంభిస్తుంది మరియు కథాంశం కూడా బాగా సెట్ చేయబడింది. అలాగే, క్రైమ్ యాంగిల్ యొక్క ఆలోచన కూడా కథలో బాగా సెట్ అయింది. పైగా చాలా ఉద్రిక్తమైన మరియు తీవ్రమైన క్షణాల్లో కొన్ని సిట్యుయేషనల్ కామెడీ సన్నివేశాలను దర్శకుడు బాగా ఆలోచించి తెరకెక్కించారు.

ఏం బాగాలేదు :

ఈ చిత్రం హ్యాంగోవర్ వంటి అనేక చిత్రాలలోని సీన్స్ ఆధారంగా సాగుతుంది. కీ రోల్స్ తమకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడటం వంటి కథను కలిగి ఉండటం బాగున్నా.. కథలో నమ్మశక్యం కానీ సీన్స్ ఉండటం, మరియు పూర్తి తమిళ నేటివిటీలోనే సాగడం, అలాగే కథనం కూడా బోర్ గా సాగడంతో సినిమా ఫలితం దెబ్బ తింది.

పైగా ఈ చిత్రం యొక్క చాలా భాగం, ఏమి జరుగుతుందో మరియు సినిమాలోని మొత్తం సమస్య ఏమిటో సరిగ్గా ఎలివేట్ కాలేదు. యోగిబాబు బ్యాచ్ దృష్టాంతంలో ఎలా తప్పించుకుంటున్నారో విషయాలు సరిగ్గా చూపించబడలేదు. క్లైమాక్స్ కూడా బాగాలేదు. దర్శకుడు ఒక చిత్రం చేయడానికి చాలా చిత్రాల సన్నివేశాలను ఉపయోగించుకోవడం చికాకు పుట్టిస్తోంది.

చివరి మాటగా :

మొత్తంమీద, ఈ ‘కాక్టెయిల్’ సినిమా అనేక క్రైమ్ కామెడీ సినిమాలలోని కంటెంట్ ను మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమాలా అనిపిస్తోంది. అయితే యోగి బాబు తన సిట్యుయేషనల్ కామెడీతో ఒక ఆహ్లాదకరమైన హాస్యాన్ని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదు. ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఈ సినిమాని చూడకపోవడమే బెటర్.

Rating: 2/5

లాక్ డౌన్ రివ్యూ: మాఫియా హిందీ వెబ్ సిరీస్(జీ5)

$
0
0

తారాగణం: ఇషా సాహా, అనిండితా బోస్, నమిత్ దాస్, రిధిమా ఘోష్

దర్శకత్వం: బిర్సా దాస్‌గుప్తా

ఎడిటింగ్: సుమిత్ చౌదరి

ప్రొడక్షన్ డిజైన్: రిద్దీ బసక్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మాఫియా హిందీ సిరీస్ ని ఎంచుకోవడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

లవర్స్ అయిన తాన్యా(మధురిమ రాయ్)కునాల్(సయాన్ బెనర్జీ) ఓ బ్యాచ్ లర్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఈ పార్టీ కోసం ఆరేళ్ళ క్రితం వారు కాలేజీ డేస్ తరువాత విడిపోయిన ప్రదేశాన్ని ఎంచుకుంటారు. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ మధ్య కొన్ని భయానక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదో తెలియని ఒక శక్తి వారిని వెంటాడుతుంది. వారికి ఎదురవుతున్న ఆ దారుణ పరిణామాలకు కారణం ఎవరు? వారికి ఆ ప్రదేశంలో ఎందుకు అలా జరుగుతుంది? మరి ఆ ఫ్రెండ్స్ అక్కడి నుండి ఎలా తప్పించుకున్నారు? అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

నటనపరంగా నమిత్ దాస్ ఆకట్టుకున్నారు. ఇక సంధర్భోచితంగా వచ్చే ట్విస్ట్ అలరిస్తాయి. ఉన్నతనమైన నిర్మాణ విలువలు మంచి అనుభూతిని కలిగించాయి. సిరీస్ తెరకెక్కించిన పరిసరాలు ఆకట్టుకోగా, ప్రారంభం సిరీస్ పై ఆసక్తిరేపింది. పాత్రలలోని భిన్న షేడ్స్ రివీల్ చేసిన విధానం బాగుంది. ఇక బీజీఎమ్ సిరీస్ కి మంచి ఆకర్షణ జోడించింది. కథలోని అసలు ట్విస్ట్ క్లైమాక్స్ లో అలరిస్తుంది.

 

ఏమి బాగోలేదు?

 

కీలకమైన సపోర్టింగ్ పాత్రల కోసం నటనలో నైపుణ్యం ఉన్న నటులను తీసుకుంటే బాగుండేది. ఇక క్లిష్టమైన కథనంలో ఉన్న అనేక అంశాలను తెరపై చూపించడంలో స్పష్టత లోపించింది. దాని వలన సిరీస్ చాలా చోట్ల గందర గోళానికి గురైంది. ఇక ఈ కథకు స్కిన్ షో అవసరం లేకున్నా మోతాదుకు మించి చూపించారు.

 

చివరి మాటగా

ఆకట్టుకొనే కథ, అలరించే మలుపులతో మాఫియా మంచి ఆరంభం అందుకుంది. ఐతే కథలో క్లిష్టత మరియు నిడివి నిరాశ పరిచే అంశాలు. మొత్తంగా మాఫియా పై ఈ లాక్ డౌన్ లో ఓ లుక్ వేయవచ్చు.

Rating: 3/5


లాక్ డౌన్ రివ్యూ: ఫోరెన్సిక్- మలయాళ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

$
0
0

నటీనటులు: టోవినో థామస్, మమతా మోహన్‌దాస్
దర్శకత్వం: అఖిల్ పాల్ & అనాస్ ఖాన్
నిర్మించినవారు: నావిస్ జేవియర్, సిజు మాథ్యూ
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: అఖిల్ జార్జ్
ఎడిట్ చేసినవారు: షమీర్ ముహమ్మద్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మలయాళ ఫిల్మ్ ఫోరెన్సిక్ ని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

కథాంశం ఏమిటీ?

సిటీలో పసిపిల్లల కిడ్నాప్స్ మరియు మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అంతు చిక్కని ఈ మర్డర్స్ వెనకున్న వారిని పట్టుకోవడానికి ఐ పి ఎస్ ఆఫీసర్ రితిక(మమతా మోహన్ దాస్) అధికారులు నియమిస్తారు. ఈ కేసులో రితికాకు సహకరించడానికి శామ్యూల్(టోవినో థామస్) మరియు …ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ శిఖ(రెబ మోనికా జాన్)ను అప్పాయింట్ చేయడం జరుగుతుంది. కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొలది రితికా టీం కొన్ని దిగ్బ్రాంతికర విషయాలు తెలుసుకుంటారు. అసలు ఈ కిల్లర్ ఎవరు? ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? రితిక టీమ్ అతన్ని ఎలా పట్టుకుంది? అనేది మిగతా కథ…

ఏమి బాగుంది?

ఓ సీరియల్ మర్డర్స్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నియమింపబడిన ఐ పి ఎస్ అధికారిణి పాత్రలో మమతా మోహన్ దాస్ ఆకట్టుకుంది. మొదటిసారి ఈతరహా రోల్ చేసిన ఆమె నటన మెప్పిస్తుంది. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలలో ఆమె నటన అద్భుతం అని చెప్పాలి. ఇక మరో కీలక రోల్ చేసిన టోవినో థామస్ మెప్పించారు.

సంజూ కురుప్, రేంజి పనికార్ సపోర్టింగ్స్ రోల్స్ లో మెప్పించారు. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ బాగున్నాయి. సస్పెన్స్ ఫ్యాక్టర్ మరియి ఇంటర్వెల్ బ్యాంగ్ పరవాలేదు.

ఏమి బాగోలేదు?
డెబ్యూ డైరెక్టర్స్ అయిన అఖిల్ పాల్ మరియు అనాస్ ఖాన్ ఒక కేసును ఛేదించడంలో ఫోరెన్సిక్ సైన్స్ ఎలా ఉపయోగపడుతుందనే దాన్ని థ్రిల్లింగ్ ఫాక్టర్స్ తో వివరించాలని ప్రయత్నించారు. ఐతే కథనంలో పట్టులేకపోవడం వలన ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. సస్పెస్స్ కోసం అనేక కొత్తపాత్రలు పరిచయం చేసి కన్ఫ్యుజ్ చేశారు. క్లైమాక్స్ సైతం ఊహకు అందేలా సాగింది.

చివరి మాటగా

ప్రధాన పాత్రల నటన మరియు ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలు, కొన్ని ఆసక్తికర మలుపులతో పర్వాలేదని అనిపించినప్పటికీ ఆకట్టుకొని కథనం, అంచనాలకు అందే క్లైమాక్స్ మూవీని దెబ్బ తీశాయి. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓ సారి ఈ చిత్రం చూడవచ్చు.
Rating: 2.5

లాక్ డౌన్ రివ్యూ: అన్ దేఖీ- హిందీ సిరీస్(సోనీ లివ్)

$
0
0

తారాగణం: హర్ష్ ఛాయ, దిబియేండు భట్టాచార్య, అభిషేక్ చౌహాన్, సూర్య శర్మ
దర్శకత్వం: ఆశిష్ ఆర్. శుక్లా
నిర్మాతలు: జ్యోతి సాగర్, సిద్ధార్థ్ సేన్‌గుప్తా, అబ్దుల్ అహాద్ నౌషాద్
సంగీతం: అనుజ్ దానైట్, శివం సేన్ గుప్తా
ఛాయాగ్రహణం: ముర్జీ పగ్డివాలా
ఎడిటింగ్: రాజేష్ పాండే

లాక్ డౌన్ రివ్యూస్ సిరీస్ లో భాగంగా నేడు హిందీ సిరీస్ అన్ దేఖీ ని ఎంచుకోవడం జరిగింది. సోనీ లైవ్ లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం…

కథాంశం ఏమిటీ?
ధామన్ అత్వాల్(అంకుర్ రాథీ) పెళ్లివేడుకలో అతని అంకుల్ ఓ డాన్సర్ ని రివాల్వర్ తో కాల్చి చంపేస్తాడు. ఆ పెళ్ళికి ఫోటో గ్రాఫర్ గా వచ్చిన రిషీ(అభిషేక్ చౌహాన్) ఆ మర్డర్ ని అనుకోకుండా తన కెమెరాలో బంధిస్తాడు. రిషీ తన దగ్గర ఉన్న ఆధారాతో పోలీసులకు ఈ మర్డర్ గురించి తెలియజేయాలి అనుకుంటాడు. ప్రమాదక కరమైన ఆ వ్యక్తుల గురించి రిషి పోలీసులకు తెలియాజేశాడా? లేదా? అసలు మర్డర్ విషయంలో తరువాత జరిగిన పరిణామాలు ఏమిటీ? అనేది మిగతా కథ…

ఏమి బాగుంది?

ఈ సిరీస్ లో డి ఎస్ పి రోల్ చేసిన దెబ్యేందు భట్టాచార్య ఈ సిరీస్ కి హైలెట్ అని చెప్పాలి. ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో పాటు, గ్యాంగ్స్ ని ఎదిరించే అధికారిగా ఆయన మెప్పించారు. ఇక ఈ సిరీస్ లో నటించిన నటులందరూ అద్భుత నటన కనబరిచారు. నార్త్ ఇండియాలో గన్ కల్చర్, నేర ప్రవృతి గురించి వాస్తవాలకు దగ్గరగా చూపించారు. ప్రతి ఎపిసోడ్ ఆసక్తికర కథనం, అలరించే ముగింపుతో సాగాయి. సిరీస్ సెటప్ మరియు బీజీఎమ్ బాగా కుదిరాయి.

ఏమి బాగోలేదు?

ఇది ఒక సింపులు స్టోరీ. అలాగే అనవసరమైన ఎలివేషన్స్ తో చాలా ఎపిసోడ్స్ వరకు సాగదీశారు. ఎపిసోడ్స్ సంఖ్య తగ్గితే బాగుణ్ణు అనే భావన కలిగింది. తనకు కాబోయే భార్య పాత్రకు ధామన్ కు మధ్య అనవసరమైన సన్నివేశాలతో నిడివి ఎక్కువైపోయింది.

చివరి మాటగా
మొత్తంగా అన్ దేఖీ ఆసక్తికర కథనం,అలరించే సన్నివేశాలతో మెప్పిస్తుంది. ఈ విలేజ్ క్రైమ్ డ్రామాలో ప్రధాన పాత్రల నటన మరో ఆకర్షణ. ఆరు మరియుఏడవ ఎపిసోడ్స్ కొంచెం సాగదీసిన భావన కలిగినా,సిరీస్ మంచి అనుభూతిని అయితే పంచుతుంది. ఈ లాక్ డౌన్ టైం లో ఈ సిరీస్ ఎంజాయ్ చేయవచ్చు.

Rating: 3.5/5

సమీక్ష : జిప్సి –బోర్ గా సాగే ట్రావెల్ అండ్ లవ్ డ్రామా !

$
0
0
Gypsy Review

Release date : July 17th, 2020

123telugu.com Rating : 2/5

నటీనటులు : జీవా, నటాషా సింగ్, లాల్ జోష్ తదితరులు

దర్శకత్వం : రాజు మురుగన్

నిర్మాత : అంబేద్ కుమార్

సంగీతం : సుశీల రామన్, సంతోష్ నారాయణన్

రంగం మూవీ ఫేమ్ జీవా హీరోగా రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన జిప్సి చిత్రం. అంబేద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో జీవా సరసన నటాషా సింగ్ జంటగా నటించింది. తమిళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని జూలై 17న తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదల చేశారు. మరి ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

జిప్సి (జీవా) పసిబిడ్డగా ఉన్నప్పుడే.. ఓ బాటసారి అతని బాధ్యత తీసుకోవాల్సి వస్తోంది. దేశం మొత్తం తిరిగే ఆ నిత్యబాటసారి.. జిప్సిని కూడా తనలాగే పెంచుతాడు. అలా ఆ ఇద్దరూ ఓ గుర్రం (జీవి)ని వెంటపెట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో వైహిదా (నటాషా సింగ్)ను చూడటం, మొదటి చూపులోనే ఇద్దరు మధ్య ఒక తెలియని ఆకర్షణ పుడుతుంది. అంతలో వైహిదాకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ పెళ్లి ఇష్టం లేని వైహిదా, జిప్సితో కలిసి లేచిపోతుంది.
ఆ తరువాత ఇద్దరూ ట్రావెల్ చేస్తూ.. హ్యాపీగా ఉంటారు. అంతలో వైహిదా నెల తప్పడం.. ఆమెకు డెలివరీకి టైం దగ్గర పడుతూ ఉన్నప్పుడు పెద్ద అల్లరులు జరుగుతాయి. ఆ తరువాత కొన్ని ఊహించని పరిణామాలతో జిప్సి, వైహిదా విడిపోతారు ? అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు ? దానికి గల కారకులు ఎవరు? వీరి బంధానికి ఉన్న అడ్డు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

హీరోగా జీవా ఇప్పటి వరకు చాలా సినిమాలనే చేసారు. కానీ తనకంటూ ‘రంగం’ తరువాత ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా మాత్రం ఏ ఒక్కటీ అంత స్కోప్ తీసుకురాలేకపోయింది. కానీ ఈ చిత్రం మాత్రం జీవాలో నటన స్థాయిని పెంచింది. కొన్ని సీన్స్ బాగున్నాయి. ఆ ఇంపాక్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు స్టైలిష్ గా అనేక కోణాల్లో కనిపించిన జీవా ఈ చిత్రం ద్వారా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తన నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఒక ట్రావెలర్ పాత్రలో కనిపించి చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా బాగుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక హీరోయిన్ నటాషా సింగ్ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి ఎమోషనల్ రోల్ లో కనిపించి తన చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. పాటలు విజువల్ గా బాగున్నాయి. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే హీరోహీరోయిన్ల పాత్రలకు మధ్య వ్యతాస్యం ఆకట్టుకున్నా.. కథాకథనాల పరంగా మాత్రం సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఫేక్ ఎమోషన్స్ తో లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా సెకెండ్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ అనవసరంగా సాగతీశారు.

దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరి ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. కొత్తగా ఒక ఏరియాలోకి వచ్చి… పైగా గుర్రం నడుపుకునే కుర్రాడు, వాడికి క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడటం, చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా ఆ ప్రేమను ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వడం, వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు విధి విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే ఈ సన్నివేశాల్లో కూడా దర్శకుడు కొన్ని చోట్ల మంచి ఎమోషన్ ను పండించాడు. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక విభాగం :

 

ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. అయినప్పటికీ కొన్ని ఎమోషన్ అండ్ లవ్ సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. కెమెరామెన్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. సినిమాలో విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకులు అందించిన సంగీతం బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ గా పనిచేసిన వ్వ్యక్తి వర్క్ ఫర్వాలేదు.

 

తీర్పు :

 

‘జిప్సి’ అంటూ ట్రావెల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పరంగా మరియు క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ కీ సీన్స్ తో సినిమా అక్కడక్కడా బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగదు. కథనం సింపుల్ గా ఉండటం, సినిమాలో సరైన లాజిక్స్ లేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అవ్వడం, సిల్లీ ఎమోషన్ తో చాలా సీన్స్ సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనుతలుగా నిలుస్తాయి. అయితే హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, అలాగే జీవా నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. అయితే ఈ లాక్ డౌన్ లో ప్రత్యేకంగా టైమ్ వేస్ట్ చేసుకుని ఈ సినిమాని చూడకపోవడమే బెటర్.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

లాక్ డౌన్ రివ్యూ : వర్జిన్ భానుప్రియ- హిందీ ఫిల్మ్(జీ5)

$
0
0

నటీనటులు: ఊర్వశి రతేలా, గౌతమ్ గులాటి

దర్శకత్వం: అజయ్ లోహన్

నిర్మాత: శ్రేయాన్స్ మహేంద్ర ధారివాల్

ఛాయాగ్రహణం: జానీ లాల్

సంపాదకీయం: అక్షయ్ మోహన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ ఫిల్మ్ వర్జిన్ భానుప్రియ ను ఇచ్చుకోవడం జరిగింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

 

కథాంశం ఏమిటీ?

జీవితంలో ప్రేమా, శృంగారం అంటే తెలియని భానుప్రియ(ఊర్వశి రతెలా) తన సోల్ మేట్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఆమె ఎంత ప్రయత్నించినా తన ఆశ తీర్చే తోడు దొరకదు. ఐతే ఆమె జాతకంలో ఓ దోషం ఉండడం వలెనే తోడు దొరకడం లేదని జ్యోతిష్కుడు చెవుతాడు. భానుప్రియ జాతకంలో ఉన్న ఆ దోషం ఏమిటీ? దానిని ఆమె ఎలా అధిగమించింది? ఆమె కోరిక చివరికి తీరిందా లేదా అనేది మిగతా కథ…

 

ఏమి బాగుంది?

ఈ మూవీలో చెప్పుకోదగ్గ ఒకే ఒక అంశం హీరోయిన్ ఊర్వశి రాతెలా నటన. గ్లామర్ గర్ల్ ఇమేజ్ కలిగిన ఈమె మంచి నటన కూడా కనబరచగలనని ఈ చిత్రం ద్వారా నిరూపించింది. ఆమె అందం అభినయంతో మూవీని నడిపించింది. ఈ మూవీకి ప్రధాన బలం ఒక్క ఊర్వశి నే అని చెప్పాలి.

 

ఏమి బాగోలేదు?

ముందుగా చెప్పుకున్నట్లు ఈ మూవీలో ఊర్వశి గురించి తప్పా మినహా చెప్పుకొనే అంశాలేవీ లేవు. మిగతా పాత్రలు చేసిన వారి యాక్టింగ్ సి గ్రేడ్ సినిమాల కంటే దారుణంగా ఉంది. ఇక ఎంచుకున్న సబ్జెక్టు మంచిదైనా సిల్లీ సన్నివేశాలు, ఆసక్తి లేని కధనంతో మూవీ సాగింది.

ఇక వర్జినిటీ గురించి ఆడవాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలలోని డైలాగ్స్ చాల వల్గర్ గా ఉన్నాయి. సంప్రదాయ ప్రేక్షకులకు ఈ మూవీలోని డైలాగ్స్ అసలు రుచించవు. ఇక మూవీలో ఎమోషన్స్ అనేవి లేకపోవడం కూడా ప్రధాన బలహీనత

 

చివరి మాటగా

 

సిల్లీ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి తోడు ఆకట్టుకొని కథనంతో సాగే వర్జిన్ భానుప్రియ ఏమాత్రం ఆకట్టుకోదు. ఒక్క ఊర్వశి రాతెలా నటన, గ్లామర్ మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు.

Rating: 1/5

లాక్ డౌన్ రివ్యూ సిరీస్: 36 వయసులో- తెలుగు ఫిల్మ్ (ఆహా)

$
0
0

నటీనటులు: జ్యోతిక, రెహ్మాన్, అభిరామి

దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్

నిర్మాత: సూరియా

సంగీతం: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: ఆర్. దివాకరన్

ఎడిట్ చేసినవారు: మహేష్ నారాయణన్

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తెలుగు మూవీ 36 వయసులో ఎంచుకోవడం జరిగింది. తెలుగు ఓ టి టి ప్లాట్ ఫార్మ్ ఆహా లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

36ఏళ్ల వసంత తన కుటుంబంతో పాటు ఐర్లాండ్ లో సెటిల్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటుంది. ఓ రోజు అనుకోకుండా భారత రాష్ట్రపతిని కలిసే అవకాశం ఆమెకు దక్కుతుంది. ఐతే రాష్ట్రపతి కలిసిన ఎక్సయిట్మెంట్ లో ఆమె ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం భర్త, కూతురు వసంతను వదిలివేసి ఐర్లాండ్ వెళ్ళిపోతారు. దీనితో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వసంత తన స్నేహితురాలు సహాయంతో సక్సెస్ ఫుల్ విమెన్ గా ఎదుగుతుంది. అసలు ఓ సాధారణ గృహిణి అయిన వసంతను రాష్ట్రపతి ఎందుకు కలవాలని అనుకున్నారు. మరి ఆమె ఐర్లాండ్ వెళ్లాలనుకున్న కల ఏమైంది? అనేది మిగతా కథ

 

ఏమి బాగుంది?

 

మంచి నటిగా అనేక చిత్రాలలో తన అధ్బుత నటనతో ఆకట్టుకున్న జ్యోతిక గృహిణి పాత్రలో చాల సహజంగా నటించారు. ఈ చిత్రానికి ఆమె నటన ప్రధాన ఆకర్షణ అనాలి. కామెడీ, ఎమోషన్స్ అండ్ ట్రాజెడీ వంటి అన్ని ఎమోషన్స్ ఆమె తన పాత్రలో చక్కగా పలికించారు.

జ్యోతిక భర్తగా ప్రధాన పాత్ర చేసిన రహ్మాన్ ఆకట్టుకున్నారు. భార్య ఆశలకు అడ్డుపడే భర్త పాత్రలో ఆయన మెప్పించారు. మహిళా సాధికారత అనే అంశాన్ని చెప్పిన విధానం బాగుంది.

నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం ఆకట్టుకుంది.

 

ఏమి బాగోలేదు?

 

సినిమా ప్రారంభమే నెమ్మదిగా మొదలవుతుంది. మొదటి అరగంట సమయం జ్యోతిక పాత్ర రొటీన్ లైఫ్ చూపించడానికి దర్శకుడు కేటాయించాడు. మెయిన్ కథలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకున్నారు.

ఇక ఈ మూవీలో దివంగత శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీ ఛాయలు బాగా కనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా సహజంగా లేదు. ఇక జ్యోతిక పాత్రను మోతాదుకు మించి ఎలివేట్ చేశారు, భర్తగా చేసిన రెహ్మాన్ పాత్రను కూడా మరీ నెగెటివ్ యాంగిల్ లో చూపించడం అంతగా రుచించదు.

ఇక దర్శకత్వం గురించి చెప్పాలంటే కథలో ఇంత సంక్లిష్టత ఉన్నప్పుడు అధ్బుతమైన స్క్రీన్ ప్లే ఉన్నప్పుడే వర్క్ అవుట్ అవుతుంది. ఈ కథను సింపుల్ గా తెరకెక్కించినా కూడా మరింత ఆకర్షణగా ఉండేదన్న భావన కలిగింది.

 

చివరి మాటగా

 

మహిళా సాధికారత అనే పాయింట్ ఆధారంగా తెరకెక్కిన 36 వయసులో మూవీ జ్యోతిక మార్కు నటనతో కొంత మేర ఆకట్టుకుంది. సమకాలీన సమాజంలో జరుగుతున్న పాయింట్ ని చర్చించిన విధానం బాగుంది. అయితే ఆకట్టుకోని కథనం, మరియు పతాక సన్నివేశాలు సినిమా ఫలితంపై ప్రభావం చూపాయి. ఐతే లాక్ డౌన్ సమయంలో ఓ సారి చూసి టైం పాస్ చేయవచ్చు.

Rating: 2.75/5

Viewing all 2201 articles
Browse latest View live